హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు నిఖిల్. ఈ సినిమా తర్వాత అతడు సోలో హీరోగా సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "స్వామిరారా" సినిమా అతని కెరీర్ ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుసగా విజయాలు చూశాడు. అలా విజయాల బాటలో నడుస్తుండగా మళ్లీ రెండు ఫ్లాపులతో వెనకబడ్డాడు. అయితే వాటిని అధిగమిద్దామని వస్తుండగా ఈ సారి అనుకోని అవాంతరం ఏర్పడింది.

 

ఆ అవాంతరం "అర్జున్ సురవరం" రూపంలో వచ్చింది. ఈ సినిమాకి వచ్చిన అవాంతరాలు నిఖిల్ కెరీర్లో మరే సినిమాకి రాలేదు. అప్పుడేప్పుడో ఆర్నెళ్ల క్రితం విడుదల కావాల్సిన ఈ చిత్రం అనేక అవాంతరాలను ఎదుర్కొని రేపు విడుదలకి సిద్ధం అయింది. అయితే ఈ ఆర్నెళ్ల కాలం నిఖిల్ జీవితంలో మరిచిపోలేని చేదులా మిగిలిపోయింది.  ఏదైతేనే చివరికి  రేపు సినిమా రిలీజ్ కాబోతుంది.

 

అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్ కార్తికేయసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తికేయ విజయం సాధించడంతో ఆ సినిమాకి సిక్వెల్ గా కార్తికేయ ౨ ఉండబోతుందట. కార్తికేయతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నాడట నిఖిల్. అందులో ఒకటి ప్రఖ్యాత బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో ఉంటుందట. ఈ చిత్రానికి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తాడట. ఇక రెండో చిత్రం హనుమాన్ అనే ఫాంటసీ కథ అని చెప్పాడు.

 

అయితే 'హనుమాన్' అనే సినిమాకు ఇంకా దర్శకుడెవరనేది ఫైనల్ అవ్వలేదని అన్నాడు. ఇక 'శ్వాస' సినిమా ఆగిపోవడంపై గురించి కూడా స్పందించాడు. ముందు తనకు చెప్పిన కథ ఒకటని ఆ తర్వాత మరో వర్షన్ చెప్పారని అందుకే ఆ సినిమా చేయలేనని చెప్పి బయటికి వచ్చేశానని అయితే అదే బ్యానర్ లో ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంటుందని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: