సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ఈ దర్శకుడు తీసిన సినిమాలన్నీ ఓ పెద్ద సంచలనమే. తన సినిమాతో హీరోలకి మునుపెన్నడూ లేనంత క్రేజ్ తెచ్చి పెట్టగలరు... రాజకీయనాయకులను విమర్శిస్తూ సినిమాలు తీసి వారి వెన్నులో వణుకు పుట్టించగలడు రామ్ గోపాల్ వర్మ . వర్మ రూటే సపరేటు మాట పూర్తిగా డిఫరెంట్. మనసులో ఉన్నది సినిమాలో చూపిస్తాడు సినిమాలో ఉన్నది తన  మాటలో చెప్పేస్తారు రామ్ గోపాల్ వర్మ. ఎవరి గురించి ఏమి అనిపించిన మొహమాటపడకుండా టక్కున చెప్పేస్తారు. ఇక తన సినిమాలైతే అబ్బో అవి వివాదాల పుట్టలే  అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో వినోదాత్మక సినిమాలను తెరకెక్కించారు వర్మ . తన సినిమాలతో పాటు ప్రేక్షకులు కూడా బాగానే ప్రభావితం చేసాడు. 

 

 ఎంతలా అంటే వర్మ  సినిమా వస్తుందంటే అందులో ఏదైనా వివాదం లేకపోతే అబ్బా ఏదో మిస్ అయిందే అని ప్రేక్షకుడు భావించేంతగా  తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేసాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే గతంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ తో టిడిపి అధినేత చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేస్తాడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమాలో చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను ఎలా  వెన్నుపోటు పొడిచారో  అసలు నిజాలే చెబుతాను అంటూ ఒక రేంజ్ లో సంచలనం సృష్టించారు. అప్పట్లో ఏకంగా చంద్రబాబు దిగివచ్చి సినిమా విడుదలను ఆపేంతగా  ప్రభావితం చేశాడు రాంగోపాల్ వర్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరోసారి ఆంధ్ర రాజకీయాలు టార్గెట్ చేస్తూ పెద్ద దుమారం రేపుతున్నారు  రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా టైటిల్ తోనే సంచలనం సృష్టించిన వర్మ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని విడుదల చేసి... పెద్ద దుమారం రేపాడు . 

 


 అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తెరకెక్కిస్తున్న  దర్శకుడు వర్మ మనసులో ఏముంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ద్వారా మరోసారి చంద్రబాబును నారా లోకేష్ ను టార్గెట్ చేయబోతున్నారా... లేక ఆంధ్ర రాజకీయాల్లోని అందర్నీ టార్గెట్ చేస్తూ సినిమా రాబోతోందా  అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు వరకు విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ పాటలతో  మరోసారి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని టార్గెట్ చేస్తున్నట్లు  స్పష్టంగా అర్థమైంది. కానీ అటు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం తన సినిమాలో ఏపీ రాజకీయాల్లోని  అందరి గురించి ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వర్మ విడుదల చేసిన ట్రైలర్లో అప్పటి లోపు బుడ్డోడు పార్టీ ని లాగేసుకుంటే  అనే డైలాగ్ ఉంది. ఈ నేపథ్యంలో వర్మ తన సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీ పై ఏమైనా ప్రభావం చూపుతున్నట్టు చూపిస్తాడా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి వర్మ మనసులో ఏముందో.?

మరింత సమాచారం తెలుసుకోండి: