రోజు రోజుకీ దేశంలో మహిళలకు భద్రత కరువైంది.  ఈ రోజే రెండు దారుణమైన సంఘటనలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి.  పుట్టిన రోజని గుడికి వెళ్లిన యువతిపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.    యువతి శవం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శరీరంపై పెద్దగా గాయాలు లేవు. కాగా మర్మాంగం నుంచి మాత్రం తీవ్ర రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. దీంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇక షాద్ నగర్ వద్ద చటాన్‌పల్లి గ్రామ శివారులో మరో ఘోరం చోటు చేసుకుంది. అక్కడి రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.  

 

బాధితురాలు  ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఘటనాస్థలి వద్దకు వెళ్లి, అది తన కూతురిదేనని గుర్తించారు. అయితే రెండేళ్ల క్రితం మలేషియాలో అపార్ట్ మెంట్ పై నుంచి కింద పడిపోయి ఓ మోడల్ దుర్మరణం పాలయింది. ఆ సమయంలో ఆమె పూర్తి నగ్నంగా ఉండటం కలకలం రేపింది. 2017 డిసెంబర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవానా స్మిత్ అనే 18 ఏళ్ల డచ్ టీనేజ్ మోడల్ ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన సంచలనం రేపింది.   కౌలాలంపూర్ లోని ఓ అపార్ట్  6వ ఫ్లోర్ బాల్కనీపై ఆమె నగ్నంగా పడిపోయింది. 

 

అయితే  అపార్ట్ మెంటులో స్మిత్ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకుందని... వారంతా గ్రూప్ సెక్స్ లో పాల్గొన్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు... తొలుత దీన్ని ప్రమాదంగానే భావించారు.  ఆమె చనిపోయే ముందు ఏదో గొడవ జరిగి ఉంటుందని.. ఆ నేపథ్యంలోనే అపార్ట్ మెంట్ పై నుంచి పడి ఉండొచ్చని పోలీసులు భావించారు.  తాజాగా ఇవానా స్మిత్ కుటుంబసభ్యులు గత వారంలో పోలీసుల వాదనను హైకోర్టులో సవాల్ చేశారు.  ఇవానా స్మిత్ పై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని వారే ఈ ఘాతుకానికి పాలప్పపడి ఉంటారని కోర్టుకు విన్నవించారు.  

 

ఈ నేపథ్యంలో కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కాగా,  ఇవానా స్మిత్ ది ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తేల్చారు. ఆ సమయంలో కొంత మంది సాక్షులను విచారిస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుతో సంబంధం ఉన్న దంపతులు ఇప్పటికే మలేషియాను వీడి  వెళ్లిపోయినట్లు సమాచారం.  మరి ఈ కేసు ఎలా ముందుకు సాగుతుందన్న విషయం పోలీసులే తేల్చాసి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: