మెగా కాంపౌండ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మెగా అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఫిదా సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తర్వాత తొలిప్రేమ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం వెంటనే మల్టీ స్టారర్ విక్టరీ వెంకటేష్ తో ఎఫ్2 తీసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి కెరీర్లో మర్చిపోలేని అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాని ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇటీవల గద్దలకొండ గణేష్ అనే సినిమాలో నటించి ఫస్ట్ టైం అదిరిపోయే మాస్ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ విభిన్నమైన కథలు కలిగిన కంచే... అంతరిక్షం లాంటి సినిమాలు చేసిన వరుణ్ తేజ్ తాజాగా బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో కలిగిన స్టోరీ టైప్ సినిమా వరుణ్ తేజ్ చేయటానికి రెడీ అవుతున్నారు.

 

ఇదిలా ఉండగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు వరుసగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల సూపర్ డూపర్ హిట్లు బాక్సాఫీస్ దగ్గర కొట్టడంతో అల్లు అరవింద్ కన్ను వరుణ్ పై పడినట్లు దీంతో..వక్కంతం వంశీ … డైరెక్షన్ లో వరుణ్ తేజ్ తో సినిమా చేయించటానికి కేతావత్ అధినేత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా టెంపర్, కిక్, రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ.. నా పేరు సూర్య చిత్రంతో దర్శకుడిగా మారారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన నాపేరు సూర్య చిత్రం నిరాశపరిచింది. దీనితో మరోసారి తాను దర్శకుడిగా నిరూపించుకునేందుకు వంశీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వక్కంతం వంశీ కొత్త చిత్రానికి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: