నటసింహం నందమూరి బాలకృష్ణ గత కొన్ని రోజులుగా తన రాబోయే 'రూలర్' సినిమా పోస్టర్ లలో న్యూ లుక్స్ తో కనిపించి తన అభిమానులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే ఇటీవల బాలయ్య ఒక ఈవెంట్ లో..  హీరో అజిత్ నటించిన  సినిమాలోని 'అలుమా డోలుమా’ అనే తమిళ మాస్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచాడు. బాలకృష్ణ డ్యాన్స్ చేసినంత సేపు అక్కడ ఉన్న వారంతా బీభత్సంగా ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ గోలగోల చేశారు. వెండితెరపై డాన్స్ చేయడం అనేది పెద్ద విషయమేమీ కాదు కానీ.. ఆఫ్ స్క్రీన్ పై సూపర్ గా డాన్స్ స్టెప్పులు వేసిన బాలయ్య చూసి... నెటిజన్లు తెగ కొనియాడుతున్నారు. 

 

 

 

వావ్ అనిపించే బాలయ్య ఫర్ఫార్మెన్స్ ఎక్కడ చోటుచేసుకుందనేది తెలియనున్నది. కానీ ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అని.. వీడియో ని చూసిన తర్వాత అర్థమవుతుంది. 50 సంవత్సరాలు దాటినప్పటికీ ఫిట్ నెస్ ని సూపర్ గా మెయింటెన్ చేస్తూ కుర్రాడి వల్లే దూసుకుపోతున్న బాలయ్యను చూసి తన అభిమానులు తెగ ముచ్చట పడిపోతున్నారు. 

 

 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక బాలయ్య సినీ జీవితానికి వస్తే.. అతని నెక్స్ట్ సినిమా అయిన రూలర్ డిసెంబర్ 20వ తారీకు విడుదలవనున్నది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బాలకృష్ణ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రూలర్ సినిమాను మినహాయించి.. బాలకృష్ణ బోయపాటి తో మరొక సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్ట పోతున్నాడని సమాచారం. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ వచ్చిన సినిమాలు సూపర్ హిట్లు అవడంతో ఆ దర్శకుడితో నే సినిమాలు తీయడానికి బాలకృష్ణ ఎక్కువ మక్కువను చూపిస్తున్నాడు. #RulerOnDec20 ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో ఉంది. 

జై బాలయ్య

మరింత సమాచారం తెలుసుకోండి: