డేంజరస్ సిస్టర్స్ గా పేరు తెచ్చుకున్న కంగన- రంగోలి జోలికి వెళ్లాలంటే మగవాళ్ళకి ఫలానా చోట  ఒణుకు వచ్చేస్తుంది. తిక్కరేగితే ఆడా, మగా..తేడా లేకుండా ఎవరినైనా శివంగి సిస్టర్స్ లా మీదపడిపోతారు. అందుకే కంగనా సహ నటీమణులు కూడా కామెంట్ చేయడానికి భయపడతారు. ఈ విషయం కూడా ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. ఇక పురుషాధిక్య ప్రపంచాన్ని ధిక్కరించడానికి ఏమాత్రం జంకని ఎరోటిక్ సిస్టర్స్ గానూ వీళ్ళిద్దరికి ఉన్న ధైర్యాన్ని చూసి మగజాతి ఆణిముత్యాలు జడుసుకుంటారు. అయితే ఇదంతా తెలిసీ కూడా రీసెంట్‌గా ఓ నెటిజన్ నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు. అది కూడా మొసలి నోటికి చిక్కినట్టు కంగన సోదరి రంగోలికి అడ్డంగా దొరికిపోయాడు. 

 

రీసెంట్‌గా జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ రిలీజైన కంగన తలైవి (నాయకురాలు) గెటప్ చూశాక.. మతి చెడిందట. దీంతో ఆ నెటిజన్.. ఆ లుక్ పైనా కంగన యాటిట్యూడ్ పైనా ఎంతో వెటకారంగా మాట్లాడాడు. కంగన గురించి నేను చాలా విన్నాను. ఈ పిచ్చిదాన్ని దయచేసి రూమ్ లో వేసి లాక్ చేస్తారా ఎవరైనా. ఆ నోటి నుంచి తిట్ల పురాణం ఆపగలమా.. వాటీజ్ దిస్ రబ్బిష్ అని కామెంట్ చేశాడు.

 

'తలైవి' జయలలిత పాత్ర కోసం ఫ్యాట్ గా మారేందుకు కంగన ఎంతగా కష్టపడుతుందో ఈ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రోస్థటిక్స్ లో ప్రయత్నించినా .. హార్మోన్ మెడిసిన్ ని ఉపయోగించిందట. దానివల్ల మెడ కింద.. నడుము కింద.. కొవ్వు పెరిగేందుకు ఆస్కారం ఉంది. జయలలిత నాయకురాలిగా ఉన్నప్పుడు ఫ్యాట్ గా కనిపించారు. ఆ లుక్ కోసం కంగన చాలా సాహసం చేసిందట. అయితే సదరు నెటిజన్ కంగన ను మ్యాడ్ ఉమెన్ అని... తిట్లతో అట్రాసిటీ చేస్తుందని వ్యాఖ్యానించడంతో రంగోలి ఆ నెటిజన్ నోరు మూయించడానికి రీట్వీట్లతో చెలరేగింది.

 

ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్ల వల్ల నటీనటులు కొన్ని నిర్ధేశించిన భాగాల్లో బొద్దెక్కవచ్చు.. అంటూ వివరణ ఇచ్చిన రంగోలి.. కంగన ఇదంతా చేసేది తను అనుకున్న పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకేనని చెప్పింది. గొప్ప నటులు.. గొప్ప స్థాయికి చేరేందుకు ఎంతకైనా తెగిస్తారు. కంగన ఫేవరెట్ స్టార్ డేనియల్ డే లూయీస్ కి పక్కటెముకలు విరిగాయి. అతడు నటనకోసం.. ఎంచుకున్న పాత్రకోసం.. రిస్క్ చేశాడు. కంగన కూడా అంతే అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది. అయితే ఈ పోస్టర్ రిలీజైన రోజు ఇలా ఒక్కడే కాదు చాలామంది నెటిజన్స్ కంగనా మీద రెచ్చిపోయారు. తిట్ల పురాణంతో రచ్చ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: