భాషా బేధం లేకుండా ఇప్పుడు అందరు స్టార్స్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం కొందరు మాత్రమే అలా అన్ని భాషల్లో సినిమాలు చేసేవారు. అయితే తెలుగు సినిమా ప్రాతీయ పరిధి దాటి సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అవడం హింది మార్కెట్ ను శాసించడం జరుగుతుంది. అయితే కేవలం తెలుగు హీరోలే కాదు మిగతా భాషల హీరోలు ఈ పంథా కొనసాగిస్తున్నారు.

 

ఇంతకుముందు కన్నడ హీరోలెవరు తెలుగు వాళ్లకు తెలిసేది కాదు. రాజ్ కుమార్ తర్వాత తన ఇద్దరు కొడుకులు అక్కడ స్టార్స్ గా ఉన్నారు. ఈమధ్యనే కె.జి.ఎఫ్ యశ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే అక్కడ స్టార్ హీరో ఉన్న రక్షిత్ శెట్టి కూడా ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. అతను హీరోగా వస్తున్న అతడే శ్రీమన్నారాయణ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది.

 

కన్నడలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ తెలుగు, తమిళ, మళయాళ, హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ గురువారం రిలీజైంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రక్షిత్ శెట్టి ఎవరో కాదు రష్మిక మందన్న మాజి లవర్. అతనికి తెలుగులో ఎన్.టి.ఆర్ అంటే ఇష్టమట. ఎన్.టి.ఆర్ నటనంటే చాలా ఇష్టమని.. ఐ లైక్ ఎన్.టి.ఆర్ అంటున్నాడు రక్షిత్ శెట్టి.

 

తెలుగులోకి రాకముందే తెలుగు హీరో మీద రక్షిత్ శెట్టి కామెంట్స్ చూస్తుంటే ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ను టార్గెట్ చేసినట్టు ఉన్నాడని తెలుస్తుంది. రక్షిత్ శెట్టి హీరోగా వస్తున్న అతడే శ్రీమన్నారాయణ మూవీని సచిన్ డైరెక్ట్ చేశారు. త్వరలో ఈ సినిమా భారీగా రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాతో రక్షిత్ కు మంచి క్రేజ్ వచ్చేలా ఉంది. తెలుగులోకి రాకముందే తెలుగు స్టార్ హీరోని కాకాపట్టడం చూస్తుంటే రక్షిత్ మంచి ప్లాన్ తోనే ఉన్నాడని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: