ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ రేస్ లో దూసుకు వెళ్తున్న కామెడీ షో ‘జబర్ధస్త్’.  ఏడేళ్ల క్రితం ప్రారంభంమైన ఈ కామెడీ షో ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తున్నారు.  ఈ కార్యక్రమంతో మొదలైన ఎన్నో రియాల్టీ షోలు ముందుకు సాగలేక చతికలబడ్డాయి.  గురు, శుక్ర వారాల్లో టివిల ముందు కూర్చునేలా చేస్తున్న  ‘జబర్ధస్త్’ కామెడీ షోకి మొదటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు, ఎమ్మెల్యే రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ ఇద్దరు జడ్జీలు కనిపించకపోవడంతో జబర్ధస్త్ నుంచి ఔట్ అయ్యారనే వార్తలు వినిపిస్తుండేవి... కానీ ఒక్కసారే ఈ ఇద్దరు జడ్జీలు తమ సీట్లలో ప్రత్యక్షం అయ్యేవారు.  కానీ ఇప్పుడు నాగబాబు  ‘జబర్ధస్త్’ నుంచి పూర్తిగా వెళ్లిపోయారు.. ఈ విషయం స్వయంగా ఆయనే తెలపడంతో ఓ క్లారిటీ వచ్చింది.  ఆయనతో పాటు  ‘జబర్ధస్త్’ మరికొంత మంది కమెడియన్లు కూడా బయటకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.

 

 ఇక నటి, ఎమ్మెల్యే రోజా ఇటు ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని... అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చారు. తాజాగా జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో... ఈ షో భారమంతా రోజాపైనే ఉందనే టాక్ వినిపిస్తోంది.  ప్రస్తుతం మా అధ్యక్షులు సీనియర్ నరేష్ జడ్జీగా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నా... ఆయన సెట్ అయ్యే వరకు రోజానే ‘జబర్ధస్త్’ భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే..నాగబాబు వెళ్లిపోవడంతో...రాజకీయంగానూ ఓ విషయంలో రోజాకు లైన్ క్లియర్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.  

 

తమకు వ్యతిరేకంగా ఉన్న పవన్ కళ్యాన్ జనసేన పార్టీపై ఇక ఎలాంటి విమర్శలైనా చేసుకోవచ్చు... మిగతా నాయకులతో పోలిస్తే... పవన్ కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో రోజా కాస్త సంయమనం పాటించారు. ఇందుకు జబర్ధస్త్ షోలో నాగబాబు ఉండటం కూడా ఓ కారణమనే టాక్ వినిపించింది.  మరి నాగబాబు బయటకు వెళ్లడం..రోజా కి రాజకీయంగా లైన్ క్లీయర్ అయినట్లే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: