నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో రూలర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా బాలకృష్ణ కొత్త లుక్లో కనిపించడంతో నందమూరి అభిమానులు ఈ సినిమా గ్యారెంటీగా బాలకృష్ణ కెరియర్ లోనే మైలురాయి సినిమాగా నిలిచిపోతుందని ఆయన యొక్క ఫస్ట్ లుక్ చూసి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం జరిగింది. ఈ సినిమా అయిన వెంటనే నందమూరి బాలకృష్ణ ...టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా కుర్ర హీరోలకు తగ్గట్టు సినిమా స్పీడ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్న బాలయ్య బాబు… తన కొడుకు మోక్షజ్ఞ చేత సినిమాల్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారో అన్న ఆసక్తి నందమూరి అభిమానుల్లో నెలకొని ఉంది.

 

ఈ నేపథ్యంలో గతంలో నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు అదే విధంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా నందమూరి మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక ఫోటో చూసి నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే ఆ మధ్య బాలకృష్ణ తన కుమారుడుతో కలిసి తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని కూడా ప్రచారం జరిగింది.

 

అయితే తాజాగా లీక్ ఐన ఒక పిక్ లో మోక్షజ్ఞ హీరో పర్సనాలిటీతో కాకుండా కాస్తంత ఒళ్లు చేసినట్టు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది దీంతో ఆ ఫోటోలో మోక్షజ్ఞ పర్సనాలిటీ చూసి… బాలకృష్ణ కొడుకు సినిమాల్లోకి రావడం కష్టమే అన్నట్టుగా నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ఇదే క్రమంలో గతంలో మోక్షజ్ఞ కి కూడా సినీ ఫీల్డ్ కాకుండా వ్యాపార రంగంలో రాణించాలని ఉద్దేశం ఎక్కువ ఉందని వార్తలు రావడంతో తాజాగా మోక్షజ్ఞ ఫోటో చూసిన వారందరూ నందమూరి బాలకృష్ణ కొడుకు సినిమాల్లోకి రావడం కష్టమే అన్నట్టుగా భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: