వరుస పరాజయాలు చూసి ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీ నుండి దుకాణం సర్దే పరిస్థితి దాకా వచ్చిన తరుణంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తానే నిర్మాతగా తన సినిమాలు తను దర్శకత్వం చేస్తూ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో అదిరిపోయే మాస్ బ్లాక్ బస్టర్ హిట్ ఈ ఏడాది జూలై 18 వ తారీఖున విడుదల చేసి అందుకున్నారు. ఈ సినిమా విజయం చూసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా బడా స్టార్ హీరోలందరూ పూరి ఇస్ బ్యాక్ అని అభినందించారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో తన స్టైల్లో డైలాగ్స్ మరియు ఫైట్లు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ని అలరించడం తో అదిరిపోయే హిట్ అందుకోవడంతో పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయటానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తర్వాత విజయ్ దేవరకొండ తో యాక్షన్ నేపథ్యం కలిగిన ఫైటర్ అనే సినిమా తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ కోసం విజయ్ దేవరకొండ తన బాడీని మరియు స్టైల్ ని మరింత రఫ్ గా కనపడేలా మార్చుకుంటున్నాడట.  పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కలిసి నిర్మించబోయే ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.

 

అలానే ఈ సినిమా కోసం ఒక యువ నటిని కూడా పూరి సంప్రదించారని, ఆమె ఎవరు అనేది మరికొద్దిరోజుల్లో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా సరికొత్త ఫీట్ లో కనిపించనున్నాడని టాక్ వినపడుతోంది. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ గతంలో  తాను తెరకెక్కించిన సినిమా స్టోరీ లు రాసుకొనే స్పాట్ బ్యాంకాక్ దగ్గరికి వెళ్లి ఈ సినిమా స్టోరీ రాసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: