కొన్నేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ , మాస్, ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటు కొన్ని సామజిక, నీతి అంశాలకు సంబందించిన సినిమాలు కూడా తెరకెక్కేవి. అంతేకాక ఆ విధంగా తెరకెక్కిన వాటిలో మంచి కథ, కథనాలు ఉన్న వాటికి ప్రేక్షకుల ఆదరణ కూడా బాగా లభించేది. అయితే రాను రాను సినిమా యొక్క రూపురేఖలు మారుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇతర భాషల వలే తెలుగు సినిమా కథలు, కథనాల్లో మార్పులు వచ్చాయి. ఎక్కువగా వైవిధ్యానికి మరియు కమర్షియల్ హంగులకు పెద్ద పీట వేస్తున్న ప్రేక్షకులు, మంచి సామజిక, పీరియాడికల్, నీతి అంశాలతో తెరకెక్కిన సినిమాలను పెద్దగా ఆదరించడం లేదు అనేది మనం అందరం ఒప్పుకుని తీరవలసిన అంశం. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, కొన్నేళ్ల క్రితం సినిమాలకు ఒకింత విరామం ప్రకటించిన సీనియర్ దర్శకుడు ఒకాయన, 

 

ప్రస్తుతం అతి త్వరలో ఒక సినిమా తీయాలని భావిస్తున్నారట. అందుకు గాను ఇటీవల పలువురు రచయితలను పిలిపించి కథలు వినడం జరిగినదట. అయితే అందులో మెజారిటీ రచయితలు చెప్పిన కథల్లో బూతు తప్పనిసరిగా ఉందట. అది విన్న ఆ దర్శకుడు, మీలో చాలా మంది చెప్పిన కథల్లో మంచి మ్యాటర్ ఉన్నప్పటికీ, దానితో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు సన్నివేశాలు ఉండడం మాత్రం తనకు పెద్దగా నచ్చలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారట. అందుకు ఆ రచయితల్లో ఒకతను పగలబడి నవ్వుతూ, సర్ మీరు కొన్నేళ్ల క్రితం ఎన్నో గొప్ప గొప్ప అంశాలను తీసుకుని మంచి చిత్రాలు తెరకెక్కించారు, 

 

కాని ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందుకే నాతో పాటు మెజారిటీ రచయితలు అందరూ చెప్తున్న కథల్లో బూతు అంశాలు తప్పనిసరి అయ్యాయని, అలానే ఇప్పటి యువతకు నీతి కథలు అవసరం లేదు, బూతు కథలే కావాలి అంటూ చెప్పుకొచ్చాడట. అసలు ఆ డైరెక్టర్ ఎవరు, ఆయనతో ఈ మాట చెప్పిన రచయిత ఎవరు వంటి విషయాలు ప్రక్కన పెడితే, ఈ విషయమై కొందరు విశ్లేషకులు మాట్లాడుతూ, ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో నీతి, సామజిక అంశాలతో సినిమాలు తీస్తే ప్రశంసలు మాత్రమే లభిస్తాయని, అదే కమర్షియల్ హాగులతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో, కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో సినిమాలు తీస్తే వాటికి కాసుల పంటే అనేది ఇటీవల పలు సినిమాల విషయమై నిరూపితం అయింది కదా అని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: