ప్రస్తుతం టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఇప్పటికే గతంలో రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి పలు వివాదాస్పద సినిమాలు తీసిన వర్మ, ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఓటమి, అలానే వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ల పై సెటైరికల్ గా ఈ సినిమాను తీస్తున్నారు. కాగా ఈ సినిమాకు హఠాత్తుగా నిన్న హై కోర్ట్ బ్రేకులు వేసింది. 

 

వాస్తవానికి ఈ సినిమా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కావలసి ఉంది. అయితే సినిమా టైటిల్ అభ్యంతర కరంగా ఉందని నిన్న హైకోర్టు సినిమా యూనిట్ కు సమన్లు జారీ చేసింది. సినిమా టైటిల్ మార్పు చేసి విడుదల చేసుకోవచ్చని చెప్పడంతో వర్మ సహా సినిమా యూనిట్ మొత్తం నేడు మీడియా ప్రెస్ మీట్ ని నిర్వహించి తమ సినిమా టైటిల్ ని అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అని తమ సినిమా టైటిల్ ని మారుస్తున్నట్లు ప్రకటించారు. తన సినిమా ద్వారా ఎవ్వరినీ కించపరచడం లేదని చెప్పిన వర్మ, సెన్సార్ వారి అభ్యంతరం మేరకు ఇటీవల సినిమాలో కొన్ని సీన్స్ తొలిగించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

వాస్తవానికి సినిమా పై అభ్యంతరం చెప్తూ ఒక వ్యక్తి సెన్సార్ బోర్డు లో కేసు వేయడంతో సెన్సార్ సభ్యులు వివాదాస్పద సీన్స్ తొలగించాలని యూనిట్ కు సమాచారం అందించారట. అయితే సినిమాలో కొన్ని కీలక సెన్స్ తొలగించినప్పటికీ ఓవర్ ఆల్ గా మాత్రం పలువురు రాజకీయ ప్రముఖులపై పూర్తి సెటైరికల్ గానే సినిమా సాగనుందని టాక్. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎక్కువగా చంద్రబాబు, లోకేష్ లను వర్మ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: