ఐటెం సాంగ్స్‌కి పెట్టింది పేరు సన్నీ. ఇప్పుడు మరోసారి తన ఒంపుసొంపులు చూపించడానికి  హల్లో జీ’ అంటూ సాగే పాటతో మన ముందుకు వస్తుంది. ఈ పాటలో సన్నీ తన దుస్తులతో, స్టెప్పులతో సెగలు పుట్టిస్తోందట. ఇంతకు ఎందులో ఇంతగా కాక రేపే పాటతో వస్తుందనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా. బాలీవుడ్ బ్యూటీ సన్నీ ప్రధాన పాత్రలో ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్ 2’ అనే వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.

 

 

ఈ సిరీస్‌లో ‘హల్లో జీ’ అనే ఐటెం సాంగ్‌లో సన్నీ మెరిసింది. ఇకపోతే ఈ పాట వీడియోను తాజాగా విడుదల చేశారు. ఏఎల్‌టీ బాలాజీ సంస్థ బ్యానర్‌పై ఏక్తా కపూర్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ ఈ పాటను పాడారు. ఇందులో ప్రముఖ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటించడం విశేషం.. ఇక ఈ పాట విషయానికొస్తే.. అదిరిపోయే డ్రెస్సుల్లో సన్నీ స్టెప్పులతో అదరగొట్టింది.

 

 

ఇక ‘రాగిని ఎంఎంఎస్’ సిరీస్ ల్యాండ్ మార్క్‌గా సన్నీ లియోన్ కెరీర్‌లో నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్ 2’ రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సిరీస్‌లో సన్నీ దెయ్యం పాత్రలో నటిస్తుండగా. ప్రముఖ నటుడు నవదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈసారి సిరీస్‌ మరింత సెక్సీ థ్రిల్స్‌తో ఉంటుందని సన్నీ తెలిపారు. ఇక కధ విషయానికి వస్తే రాగిని ష్రాఫ్ అనే 20 ఏళ్ల యువతి తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ట్రిప్‌కి వెళ్తుంది.

 

 

ఈ ట్రిప్‌లో భాగంగా జరిగే కొన్ని సంఘటనలు రాగిని జీవితాన్ని తలకిందులు చేసేస్తాయి. ఆ సంఘటనలు ఏంటి అనే టాపిక్‌తో ఈ సిరీస్ సాగుతుందని తెలిపారు. ఇక డిసెంబర్ 18 నుంచి  ప్రసారం అవుతున్న ఈ సిరీస్ జీ5, ఏఎల్‌టీ బాలాజీ యాప్స్‌లో చూడవచ్చూ. ఇక సన్నీ చేసే ఐటెం సాంగ్స్‌కు మార్కెట్‌లో ఉండే డిమాండే వేరు. పాట విడుదలైన నిమిషంలోనే 26వేల మందికి పైగా దీనిని వీక్షించారు. ఇలాంటి సాంగ్స్‌తోనే సన్నీ బాలీవుడ్‌లో పాపులర్ అయింది. ఇక ఫ్యాన్స్‌కి ఈ పాటను చూడగానే నిద్రపట్టదేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: