బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయడంతో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పేరు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. అయితే 'సాహో' సినిమాతో ఆ పేరు మరింత మార్మోగుతుందని ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అందరు ఊహించినప్పటికి ఆశించిన విధంగా సాహో ఆడలేదు సరికదా కమర్షియల్ గాను బాగా లాస్ అని తేలింది. దీంతో ఇక భారీ సినిమాలు కాకుండా చిన్న సినిమాలే అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసే విధంగా ఉండాలని రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

 

ఈ సినిమాకి ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ 'జాన్' గా పెట్టారు. ఈ సినిమాపై డార్లింగ్ ప్రత్యేక దృష్టి పెట్టాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ అందాయి. అయితే సినిమా ఎలా ఉంటుంది..? ఏ జోనర్‌లో తెరకెక్కుతోంది..? అని అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ఫ్రైజింగ్ అప్డేట్ వచ్చిందని తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్‌లో నటిస్తున్నాడట. ఇప్పటివరకు ఈ సినిమాలో ఒకటే క్యారెక్టర్ అని అనుకున్నారు. అయితే ఈ ట్విస్ట్ తో అందరికి చిన్న షాకిచ్చారు చిత్ర యూనిట్. అంతేకాదు.. ఈ సినిమాలో ఒక పాత్ర ఓల్డ్ గెటప్‌లో.. మరోటి యంగ్ గెటప్ ఉంటుందని మరో ఫ్రెష్ అప్‌డేట్. ఇందులో ఓ పాత్రలో అత్యంత ధనవంతుడిగా ప్రభాస్ కనిపిస్తాడట. అలాగే పేదింటి అమ్మాయి ప్రేమలో పడి.. ఆమె కోసం సర్వం కోల్పోయి .. ప్రేమలో గెలవడానికి అన్నీ వదిలేస్తాడని సమాచారం.

 

1960 కాలంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అప్డేట్స్ ఫిల్మ్ నగర్‌లో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటిస్తోంది. ఇటీవల ఈ బ్యూటి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవడానికే అమెరికా వెళ్లింది. ప్రభాస్ నిజమైన ఇంటర్నేషనల్ స్టార్ అని.. తాను చూసిన వ్యక్తుల్లో ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని డార్లింగ్‌ను పూజా ఆకాశానికి మోసేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి మరికొన్ని అప్‌డేట్స్ తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా కమిటయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: