కొద్దిరోజులుగా హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు కొందరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పేరిట వేధింపులకు గురవుతున్న వార్తలు పలు సినిమా పరిశ్రమల్లో ఎంతో సంచలనాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను కొందరు మేనేజర్లు మరియు కో ఆర్డినేటర్లు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వారిని మోసగించి లొంగదీసుకోవడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తున్నారని ఇటీవల వర్ధమాన టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కూడా దీనిపై కొంత నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తత్ఫలితంగా సినిమా ఇండస్ట్రీలో ఆడవారి కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. కాగా ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఇటువంటి వేధింపులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. 

 

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, బాలీవుడ్ శృంగార తార రాఖి సావంత్, సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయని నేడు మీడియా ముఖంగా తెల్పడం జరిగింది. తనకు అవకాశాలు ఇస్తానని కొందరు సినిమా నిర్మాతలు మరియు దర్శకులు తమ గదులకు రప్పించి, వెంటనే తలుపులు మూసి వేసి, నీ దుస్తులు తీసేసి టాలెంట్ ని చూపించమని చెప్పేవారట. అయితే అలా తలుపులు మూసినా సమయంలో తనకు ఏమి అర్ధం అయ్యేది కాదని, మరికొందరు అయితే షో యువర్ టాలెంట్ అని అడిగేవారని చెప్పుకొచ్చింది. 

 

నిజానికి తనకు ఆ పదానికి డబుల్ మీనింగ్ ఉన్నట్లు చాలాకాలం వరకు అర్ధం అయ్యేది కాదని, అందుకే తనకు మొదట్లో అసలు అవకాశాలు రాలేదని చెప్పింది. అయితే సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలకు లైంగిక వేధింపుల పేరిట మీటూ ఉద్యమం ఎప్పటినుండో జరుగుతుంటే, ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాఖీ, ఇప్పుడు సడన్ గా ఇలా తనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేస్తుంటే, మరికొందరు మాత్రం, ఆమె కూడా అమ్మాయే కదా, తనకు మాత్రం అటువంటి సమస్యలు ఎదురవ్వవా అంటూ ఆమెకు మద్దతు పలుకుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: