బిగ్ బాస్ షోకి ఎంత ప్రజాదరణ ఉందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ౨౦౧౭ లో స్టార్ట్ అయిన ఈ గేమ్ షో అనతి కాలంలోనే మంచి ఆదరణని దక్కించుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన మొదటి సీజన్ విజయవంతమైంది. దానితో రెండవ సీజన్ అట్టహాసంగా మొదలైంది. రెండవ సీజన్ లో మరింత మసాలా ని జోడించి ప్రేక్షకుల మీదకి వదిలారు. అయితే ఈ రెండవ సీజన్ వారు అనుకున్నట్టుగానే హిట్ అవడంతో పాటు అనుకోని వివాదాలని కూడా తెచ్చి పెట్తింది.

 


ఈ సీజన్ లో కౌషల్ ఆర్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హౌస్ లో కౌషల్ ఒక్కడే వేరుగా ఉండడంతో అతని మీద సింపతీ పెరిగి జనాల ఓట్లని పొందగలిగాడు. దాంతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవగలిగాడు. బిగ్ బాస్ లో టైటిల్ గెలిచిన వారికి కెరీర్ మలుపు తిరుగుతుందని అనుకుంటారు. కానీ ఇప్పటికీ మూడు బిగ్ బాస్ సీజన్ లు అయ్యాయి. వాటిలో గెలిచిన ఏ ఒక్కరికీ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.

 

కౌషల్ పరిస్థితి కూడా అలాంటిదే. బిగ్ బాస్ కి రాకముందు అతను సీరియల్స్ లో నటించేవాడు. అప్పుడపుడు కొన్ని సినిమాల్లో కూడా కనిపించాడు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత కౌషల్ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. దీన్ని బట్టి బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ వస్తుంది కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రావని రుజువైంది. అయితే కౌషల్ తనకి వచ్చిన పాపులరిటీని ఉపయోగించుకునే పనిలో ఉన్నాడు.

 

ఇటీవల కౌషల్ బీజేపీలో చేరి అందరికీ షాకిచ్చాడు. బిగ్ బాస్ విన్నర్ అయిన కౌషల్ సడెన్ గా రాజకీయాల్లోకి రావడం ఆశ్చర్యపరిచింది. ఈనెల 28వ తేదీన గురువారం నాడు ఆయన బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: