లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు శ్రీ విష్ణు. ఈ సినిమాలో చిన్న పాత్ర వేసిన శ్రీ విష్ణు ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించాడు. అయితే హీరోగా అతడు నటించిన "అప్పట్లో ఒకడుండేవాడు" చిత్రం అతని కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పింది. ఈ సినిమాలో అతని నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు రావడంతో పాటు సినిమా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అప్పటి నుండి శ్రీ విష్ణుకి హీరోగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

 

మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ లాంటి చిత్ర్రాలు అతని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచాయి. ఇక ఈ సంవత్సరం వచ్చిన బ్రోచేవారెవరురా చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంది. దాంతో శ్రీ విష్ణు సినిమాల విషయంలో కొంచెం ఫాస్ట్ అయ్యాడు. ఆ వేగంలోనే తిప్పరా మీసం అంటూ వచ్చాడు. కానీ ఈ సినిమా   మీసం తిప్పే లాంటిది కాకపోవడంతో ప్రేక్షకులు పక్కన పెట్టారు.

 

దాంతో ఇప్పుడు మళ్ళీ అతని దృష్టి కామెడీ మీదే పడిందట. తనకి మంచి హిట్ ఇచ్చిన బ్రోచేవారెవరురా లాంటి స్క్రిప్ట్ కోసం చుస్తున్నాడట. ఇప్పటికే ఆ జోనర్ లో కొన్ని కథలు విన్న ఆయన, ప్రస్తుతం ఇంకొంతమంది యువ దర్శకుల నుండి కూడా కథలు వినే పనిలో ఉన్నాడట. ‘బ్రోచేవారెవరురా’లాంటి స్క్రిప్ట్ దొరికితే వెంటనే ఆ డైరెక్టర్ ను లాక్ చేసేస్తాడట. సో.. ఇక పై శ్రీవిష్ణు నుండి మంచి హాస్యభరిత చిత్రాలను ఆశించవచ్చన్నమాట.

 


మరి అన్ని చిత్రాలు బ్రోచేవారెవరురా లాగా అవలేవు. కథలో ఇంటెన్సిటీ, మాటల్లో హాస్యం ఉంటేనే బ్రోచేవారెవరురా లాంటి సినిమాలు వస్తాయి. మరి శ్రీ విష్ణు తన తర్వాతి సినిమాలో ఇవన్నీ ఉంటాయో లేవో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: