టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కొందరు ఆ తర్వాత ఒక్క డిజాస్టర్ తో కొన్నేళ్ళపాటు అవకాశాలు రాక మళ్ళీ మొదటికే వచ్చారు.ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ నిర్మాతలు హీరోల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా సంవత్సరాల పాటు అవకాశం రాని పరిస్థితి. అయితే ఇప్పుడు అలాంటి ఒక ముగ్గురు దర్శకులు మళ్ళీ తమ లక్ ని చెక్ చేసుకుంటున్నారు. పరిశ్రమలో సక్సెస్ చాలా ముఖ్యం. అది లేకపోతే ఏదీ లేదు. అందుకే ప్రతి సినిమాని మొదటి సినిమాగా భావించి హిట్టుకొట్టాలి. అలా మొదటి సినిమాతో హిట్లు కొట్టి ఆ తర్వాత ఫ్లాపులు ఎదురై.. ఏకంగా మూడేళ్ల గ్యాప్ వచ్చాక ఓ ముగ్గురు దర్శకులకు అవకాశాలు రావడం లక్ అని చెప్పాలి.

 

అలా ఛాన్సులు దక్కించుకున్న ఆ ముగ్గురూ సరైన బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా..! బొమ్మరిల్లు భాస్కర్- సంతోష్ శ్రీనివాస్- శ్రీకాంత్ అడ్డాల. ఈ ముగ్గురూ మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్. కానీ అనుకోకుండా వచ్చిన ఫ్లాప్స్ తమ జీవితాన్ని తిరగేశాయి. బొమ్మరిల్లు- పరుగు సినిమాలతో భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తీసిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాపులయ్యాయి. దీంతో భాస్కర్ కి మళ్ళీ అవకాశం రావడానికి మూడేళ్లు పైగానే ఎదురు చూశాడు. మొత్తానికి అల్లు అరవింద్ ని స్క్రిప్టుతో ఇంప్రెస్ చేశాడు. అక్కినేని అఖిల్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టి మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు భాస్కర్. 

 

కందిరీగ లాంటి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా.. బెల్లంకొండ నిర్మాతగా.. రభస తెరకెక్కించాడు. సినిమా ఫ్లాపయింది. ఆ తర్వాత హైపర్ తో యావరేజ్ సినిమాని తీసినా మళ్ళీ అవకాశాలైతే రాలేదు. తాజాగా మరోసారి బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది.  ఇక శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి మరీ దారుణమని చెప్పాలి. కొత్తబంగారు లోకం - సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి క్లాసిక్స్ ని తీసి ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకున్నాడు. తర్వాత చేసిన ముకుంద యావరేజ్ అయినప్పటికి మళ్ళీ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు. దీంతో మూడేళ్లు  ఖాళీగానే ఉన్నాడు. 

 

అదే సమయంలో మహేష్ తో బ్రహ్మోత్సవం తెరకెక్కించి ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. ఒక్క ఫ్లాప్ శ్రీకాంత్ పై చాలా ప్రభావం చూపించింది. ఇటీవలే తమిళ సినిమా అసురన్ ని తెలుగులో రీమేక్ చేసే అవకాశం వెంకటేష్-సురేష్ బాబు కల్పించారు. శ్రీకాంత్ గీతా ఆర్ట్స్ లోనూ ఓ చిత్రానికి కమిటయ్యారని ఇంతకు ముందు వార్తలొచ్చాయి. ఈ సినిమాలో నాని హీరో అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం ఈ ముగ్గురి మూడేళ్ళ తర్వాత వచ్చిన అవకాశం తో మళ్ళీ బ్లాక్ బస్టర్ ని అందుకొని మళ్ళీ ఫాం లోకి వస్తే బావుంటుంది. లేదంటే ఈసారీ పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: