సెల‌బ్రెటీలు ఏ బ‌ట్ట‌లు వేసినా అది ఫ్యాష‌నే. అందులోనూ హీరో, హ‌రోయిన్లు వేసే బ‌ట్ట‌ల‌కు మ‌రింత క్రేజ్ ఎక్కువ‌. ఏద‌న్నా సినిమాలో హీరోయిన్ క‌ట్టిన చీర ఫేమ‌స్ అయిందంటే చాలు అంద‌రూ ఆ మోడ‌ల్ పైనే ఉంటారు. అలాగే హీరోలు వేసే ష‌ర్టులు పైన కూడా క్రేజ్ అలానే ఉంటుంది. వాళ్ళు వేసుకునే ష‌ర్టులు కొనుక్కోవాల‌ని అనుకుంటుంటారు. ఇక అమ్మాయిల‌యితే చ‌ప్ప‌క్క‌ర్లే. ఫ్యాష‌న్ పేరుతో ఎలాంటి బ‌ట్ట‌లు ప‌డితే అలాంటివి వేసుకుని తిరుగుతుంటారు.

 

తాజాగా బాలీవుడ్ నటి ప్రనూతన్ బెహెల్ కట్టుకున్న చీర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలనాటి బాలీవుడ్ తార నూతన్ మనవరాలైన ప్రనూతన్ ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కుర్రకారును తనవైపునకు తిప్పుకున్నారు. కాగా.. గురువారం ప్రముఖ నిర్మాత సూరజ్ భర్జాత్యా కుమారుడు దేవాన్ష్ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. నిన్న సాయంత్రం ముంబయిలో గ్రాండ్‌గా వివాహ విందును ఏర్పాటుచేశారు. ఈ విందు బాలీవుడ్‌కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. వేడుకకు ప్రనూతన్‌ కూడా హాజరయ్యారు. అయితే ఆమె వేసుకున్న దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

చూడ‌టానికి చీర చాలా బావుంది.  కానీ లోపల వేసుకునే బ్రాను ఆమె బ్లౌజ్‌గా  ధ‌రించి అంద‌రూ అవాక్క‌య్యేలా చేశారు.  దాంతో అక్కడివారు చూపు తిప్పుకోలేకపోయారు. చీరను ముందు భాగంగా పూర్తిగా కప్పుకోకుండా తన అంద‌చందాల‌తో కుర్ర‌కారును ఆకర్షించింది. ఇక ట్రోలింగ్ మొద‌లుపెట్టారు.  కొంత‌మంది నెటిజన్లు ప్రనూతన్‌కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఆమె ఓవర్ ఎక్స్‌పోజింగ్‌ను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటివి వేసుకుని బయటికి మాత్రం రావొద్దని కామెంట్లు కూడా పెడుతున్నారు. ‘నోట్‌బుక్’ సినిమాతో ప్రనూతన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. ఇక ఏది ఏమైన‌ప్ప‌టికీ ఏపార్టీకి ఎలా వెళ్ళాలి అన్న‌ది ముఖ్యంగా తెలియాలి. అది హీరోయిన్ కావొచ్చు వేరే ఏదైనా కావొచ్చు కానీ మ‌నం ధ‌రించే దుస్తుల‌తోనే మ‌న‌కు గౌర‌వం ల‌భిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: