తెలుగులో వస్తున్న పాపులర్ కామెడీ షో జబర్ధస్త్.   ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.  ప్రతిరోజూ కొత్త కొత్త స్కిట్స్ తో ఇందులో కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తున్నారు.  జబర్ధస్త్ కామెడీ షో ప్రారంభమైనప్పటి నుంచి మెగాబ్రదర్ నాగబాబు, నటి, ఎమ్మెల్యే రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.  అయితే ఏడేళ్లలో అప్పుడప్పుడు వారి స్థానాల్లో కొత్త జడ్జీలు వస్తున్నా..ఒకటీ రెండు ఎపిసోడ్స్ తర్వాత తిరిగి నాగబాబు, రోజాలే జడ్జీలుగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు.  జబర్ధస్త్ గత కొంత కాలంగా ఎన్నో విమర్శలు వస్తున్నాయి. కమెడియన్ వేణు ఓ వర్గం వారిని అవమానించారని దారుణంగా ఎటాక్ చేశారు. 

 

ఆది, చమ్మక్ చంద్రపై పలు విమర్శలు వచ్చాయి.  ఇందులో మగవారికి ఆడవారి వేషాలు వేయించి ఆడవారి మనోభావాలు దెబ్బతినేలా స్కిట్స్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి.  ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్ధస్త్ లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అంటున్నారు.  ఇప్పటికే జడ్జీగా వ్యవహరిస్తున్న నాగబాబు నిష్క్రమించారు.  ఆయనతో పాటు మరికొంత మంది నటులు జబర్ధస్త్ నుంచి బయటకు వస్తారని టాక్ వినిపిస్తుంది.  తాజాగా నాగబాబు జబర్ధస్త్ తన సొంత యూట్యూబ్ లో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  తాను జబర్ధస్త్ కోసం ఎన్నో త్యాగాలు చేశానని.. రెమ్యూనరేషన్ తన స్థాయి కాకపోయినా ఇష్టంతో చేశానని అన్నారు. 

 

ఇటీవల జబర్ధస్త్ కొంత మంది మద్యవర్తుల వ్యవహారం బాగా ఎక్కువైందని..ఈ విషయం జబర్ధస్త్ నిర్వహకులు ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డిగారికి తెలుస్తుందో లేద నాకు తెలియదని అన్నారు. ఒకవేళ తెలిసినా అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారో ఏమో. దాని వల్ల జబర్ధస్త్ ఉనికి కోల్పోతుందని ఆయన గ్రహించాలి. తెర వెనుక జబర్ధస్త్ కోసం నేను చాలా కష్టపడ్డాను..కానీ ఈ మద్య నా కళ్ల ముందు జరుగుతున్న ఘోరాలు చూస్తు భరించలేకపోయాను.

 

నన్ను బాగానే చూసుకునేవారు..కానీ స్కిట్స్ తో జబర్ధస్త్ ప్రాణం పోస్తున్న నటుల గురించి పట్టించుకోకుండా మద్యవర్తులు చాలా దారుణాలు చేస్తున్నారని అన్నారు. అప్పట్లో వేణుపై దాడిని కూాడా ఖండించలేదు.  అందుకే వేణు- ధన్ రాజ్ మరికొంత మంది జబర్ధస్త్ ని వీడిపోయారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: