ఇప్పుడు తెలుగు సినిమాల పరిస్థితి మారిపోయింది. ఇంతకు ముందు ఫార్ములా బేస్డ్ సినిమాలు తీసే మనవాళ్ళు ఇప్పుడు పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకి వచ్చేశారు. దాని ఫలితంగానే ఈ ఏడాది తెలుగు సినిమాకి ఏడు జాతీయ అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ నటి విభాగంలో తెలుగు సినిమాకి అవార్డు రావడం ఇండస్ట్రీకి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్ కి రీమేక్ కి వెళ్తున్నాయి.

 

తెలుగు సినిమాలతో పాటే తెలుగు దర్శకులు కూడా బాలీవుడ్ కి వెళ్తున్నారు. ఒక భాషలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని వేరేభాషలో తెరకెక్కించాలంటే ఓరిజినల్ డైరెక్టర్ అయితేనే కరెక్ట్ గా కుదురుతుంది. అందుకని తెలుగు దర్శకులకి వరుసగా బాలీవుడు ఆఫర్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా "కబీర్ సింగ్ " సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు.

 

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే కాదు ఎవ్వరూ ఊహించని వసూళ్ళతో విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. తెలుగులో అంతగా ఆడలేకపోయినప్పటికీ విమర్శకులను మెప్పించిన ప్రస్థానం "సంజయ్ దత్ " హీరోగా హిందోలోకి రీమేక్ అయింది. ఈ చిత్రానికి ఒరిజినల్ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వం వహించారు. అలాగే నాని హీరోగా ఎమోషనల్ హిట్ అందుకున్న "జెర్సీ" హిందీలోకి వెళ్తుందన్న విషయం తెలిసిందే.

 

ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాటగిరీలోకి మరో దర్శకుడు కూడా వెళ్ళిపోయాడు. అనుష్క నటించిన భాగమతి సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీలో "దుర్గావతి" గా తెరకెక్కనుంది. భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి భాగమతి దర్శకుడు అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా తెలుగు దర్శకులకి బాలీవుడు ఆహ్వానం అందడం నిజంగా సంతోషమే.  ముందు ముందు ఇంకెంత మంది బాలీవుడ్ లోకి వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: