బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ చేస్తున్న‌విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్ర లాభాల్లో యాభైశాతం కేవ‌లం రైటింగ్ స్కిల్స్‌కి ఇవ్వ‌డం అనేది చాలా పెద్ద విష‌యం. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌కు ఇచ్చిన ఆఫ‌ర్ అదే. 

 

బేసిక్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో దిల్‌రాజు చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తారు. వ్యాపార విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇక ఈ విష‌యంలో కూడా ఆయ‌న తెలివిగా వ్య‌వ‌హ‌రించార‌నే చెప్పాలి. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి  ఆయ‌న వేసిన గాలం అని కొంద‌రు భావిస్తున్నారు. ఆ మేరకు త్రివిక్రమ్ కు ఆ ఆఫ‌ర్ ఇచ్చి వుండాలి.

 

అయితే అవ‌స‌రం తీరాక ఒక మాట తీర‌క‌ముందు ఒక‌మాట అన్న‌ట్లు సినిమా సెట్ అయిన తరువాత మెల్లగా త్రివిక్రమ్ ను ఆయన అంతట ఆయన దూరం అయ్యేలా చేసారు. దిల్ రాజు వైఖరితో ఇగో హర్ట్ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు దూరం అయ్యారు. దాంతో ఇక ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ అన్న ఊసే లేదు.

 

దర్శకుడిగా వున్న వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ ప‌ని కూడా ఆయ‌నే చూసుుకుంటారు. దీనికి అదనపు ఖర్చు కూడాలేదు. అందువల్ల దిల్ రాజు ఎత్తుగడ బాగానే ఫలించినట్లు అనుకోవాలి. ఎటొచ్చీ పవన్ దగ్గర బ్రేక్ పడకుండా వుంటే. సినిమా ప‌ట్టాలెక్కిన‌ట్లే. మొత్తానికి దిల్‌రాజు ఎత్తుగ‌డ బాగానే ప‌ని చేసింది. మరో ప‌క్క చెప్పాలంటే త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం త‌న బిజీ షెడ్యూల్స్‌తో ఫుల్ బిజీగా అల‌వైకుంఠ‌పురం చిత్రం ప‌నుల్లో ఉన్నారు. మ‌రి పింక్ చిత్రం నుంచి పూర్తిగా త‌ప్పుకున్న‌ట్లేనా ఏంటి అన్న‌ది తెలియాలి. గ‌తంలో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ తీన్‌మార్ చిత్రానికి కూడా ఆయ‌నే స్క్రిప్ట్ అందించారు. ఇక విష‌యంలో ఇలా జ‌ర‌గ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది తెలియాల్సి ఉంది.   ఇటీవల రామ్‌ చరణ్‌ మలయాళ సూపర్‌ హిట్ లూసీఫర్‌ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా పవన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ ఆ వార్తలను ఖండించింది. లూసీఫర్‌ రీమేక్‌ హక్కులు తీసుకున్న మాట వాస్తవమే అయినా.. అది ఎవరితో తెరకెక్కించాలన్న విషయం ఇంకా నిర్ణయించలేదని మెగా హీరోగా రామ్‌ చరణ్‌ క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: