రాజకీయాల్లో ఉన్నన్నిరోజులు మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆయన మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడిస్తారు..ఫ్యాన్స్ ని ఎప్పుడు అలరిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు. అందరు అనుకున్నట్టుగానే మెగా ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే చిరు మళ్ళీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఖైదీ నంబర్ 150 తో సూపర్ హిట్ ని అందుకున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక సైరా సినిమాలతో మంచి సక్సస్ ని అందుకున్నారు చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా సినిమాతో ఏళ్ళ తరబడి తన మనసులో తీరని కోరికగా మిగిలిపోయిన స్వాతంత్ర సమరయోధిడిగా నటించి తన కోరికను తీర్చుకోవడమే కాకుండా మంచి హిట్ ని దక్కించుకున్నాడు. 

 

ఇక ఇదే ఊపుతో మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా కొరటాలతో చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలు విజయదశమి  సందర్భంగా చిరు 152 ని మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఆ సినిమాకి సంబంధించి ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదల కాకపోవడం..ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటనలో ఏవీ ఇంకా బయటకు తెలియకపోవడంతో ఫ్యాన్స్ లో ఆందోళనతో పాటు రకరకాల వార్తలు ఈ సినిమాపై ఇండస్ట్రీతో పాటుగా సోషల్ మీడియాలోనూ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. 

 

వాస్తవంగా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ శ్రేయ నటిస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోను గట్టిగా వినబడుతోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష కూడా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అందుకు కారణం మెగాస్టార్ తో త్రిష స్టాలిన్ సినిమాలో నటించగా, శ్రేయ శరణ్ ఠాగూర్ సినిమాలో నటించింది. అందుకే చిరు ఏజ్ కి తగ్గట్టు ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా హీరోయిన్ ఎవరనేది క్లారిటి ఇవ్వలేదు చిత్ర బృందం. ఇక ఈ సినిమాకి సంబందించి రెగ్యులర్ షూటింగ్ కూడా గత నెలలోనే మొదలు కావాల్సింది. కాని అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో వస్తున్న రూమర్స్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ గా అప్‌డేట్ ఇస్తే బావుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: