అప్పట్లో శివబాలాజీ మొన్న కౌశల్ ఇప్పుడు  రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ విజేతలు అయితే బిగ్ బాస్ విజేతలకు మంచి పేరుతో పాటు యాభై లక్షల నగదు అందుకోవడం అందరికి తెలిసిన విషయమే అయినా వారికి మంచి మంచి అవకాశాలు దక్కుతాయని ముందుగా అనుకున్నారు. కానీ ఎవరికీ చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడం తో నిన్నటి బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లీగంజ్ కి కూడా అదే పరిస్థితి అని  అనుకున్నాం కానీ ఎవరికీ దక్కని గౌరవం మరియు సినిమా  అవకాశాలు ఇతడికి అందాయని అనిపిస్తుంది.

ఎందుకంటే ఇతను మంచి గాయకుడు అయినా అతనికి పాటలతో పాటు సినిమాల్లో నటుడిగా కూడా అవకాశాలు వస్తున్నాయి.  రాహుల్ ఒక  సింగింగ్ కాంపిటీషన్ ద్వారా  ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఆ తర్వాత సినిమాల్లో అవకాశం దక్కించుకుని మంచి  సింగర్‌గా నిలదొక్కుకున్నాడు ఇదే క్రమంలో కొన్ని ఆల్బమ్స్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నాడు. ఇక బిగ్ బాస్ షో తర్వాత అతడి పేరు ప్రతి ఇంటికీ ప్రతి ప్రేక్షకుడికి  తెలిసిపోయింది అయితే  ఈ బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత రాహుల్  పేరు అమాంతం పెరిగిపోవడంతో సింగర్‌గా మరియు  యాక్టర్‌గా పలు అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

ఇతడు సింగింగ్ లో బిజీ గా ఉన్న రాహుల్ ఇప్పుడు హీరో అవకాశం రావడం తో ఎటు తేల్చుకోలేక పోతున్నాడు. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కడం తో అందులో హీరోగా రాహుల్ ని తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఇక, ఇదే సినిమాలో మరో బిగ్ బాస్ సభ్యుడు  అయిన అలీ రేజా కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే రెండు రోజుల క్రితం  మీడియా లో  వెల్లడించాడు. అంతేకాదు సినిమా కి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ప్రకటించారు. అయితే బిగ్ బాస్ ఇంట్లో స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు కలిసి సినిమా తీయడం గమనార్హం చూడాలి సినిమా లో వీరు ఇద్దరి నటన ప్రదర్శన ఇలా ఉండబోతున్నారో.

మరింత సమాచారం తెలుసుకోండి: