సిల్క్ స్మిత...టాలీవుడ్ ని ఒక మలుపు తిప్పిన నటీమణి, పెద్ద డ్యాన్సర్.. ఆమె 80 దశకంలో ఐటం సాంగ్స్ లో తన సత్తా చాటుకుంది. ఆమె సాంగ్ లేని సినిమా అప్పట్లో లేదంటే అతిశయోక్తి కాదు, ఆమె గోదావరి జిల్లాలకు చెందిన తెలుగు ఆడపడుచు. వండి చక్రం తమిళ్ మూవీ  ద్వారా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మూవీలో ఆమె పాత్ర పేరు సిల్క్. దాంతోనే ఆమె సిల్క్ స్మితగా ప్రసిద్ధి అయ్యారు.

 

నాలుగు దశాబ్దాల క్రితం కుర్రకారుకు సిల్క్ స్మిత కలల రాణి. ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా శోభన్ బాబు హీరోగా నటించిన ఘరానా గంగులు. ఈ మూవీ తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అయితే సిల్క్ స్మిత ఎక్కువగా ఐటం సాంగ్స్ లోనే కనిపించింది. ఆమెలోని నటీమణిని వెలుగులోకి తెచ్చిన వారిలో భారతీరాజా, దాసరి నారాయణరావు వంటి డైరెక్టర్లు ఉన్నారు.

 

సీతాకోకచిలుకలో ఆమె నటన చాలా బాగుంటుందని ప్రశంసలు  వచ్చాయి. అలాగే దాసరి తీసిన అభిమన్యుడు మూవీలో ఆమె పాత్ర ఆడియన్స్ సింపతీని సంపాదించేలా సాగుతుంది. ఇక సిల్క్ స్మిత తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ చిత్రాలన్నీ కలుపులుని 450 పైగా చిత్రాల్లో నటించారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. ఏలూరు దగ్గర దెందులూరు మండలంలోని ఒక గ్రామంలో 1960 డిసెంబర్ 2న  పుట్టి సౌత్ ఇండియాని దాదాపుగా 17 ఏళ్ళ పాటు ఒక విధంగా ఏలిన తారగా  సిల్క్ స్మితను చెప్పుకోవాలి

 


ఇక సిల్క్ స్మిత  కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగనే సడెన్ గా తన అభిమానులను విషాదంలో ముంచేస్తూ 1996 సెప్టెంబర్ 23న ఉదయం చెన్నైలోని తన అపార్ట్మెంట్లో ఫ్యాన్ కి చీరను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే చెప్పాలి. ఆమె అప్పులపాలు అయి ఇలా చేసిందని ప్రచారంలో ఉంది. తాను అనుకున్న వారు ఎవరూ లేకపోవడం, మోసపోవడం వల్ల అని మరికొంత ప్రచారంలో ఉంది.

 

ఏది ఏమైన స్మిత పేరు అంటే చిరు నవ్వు. ఆమె సినీ జీవితంలో తన నటన, అందంతో ఎందరి మదిలో చిరునవ్వులు పూయించిన ఆమె తన జీవిత పర్యంతం విషాదంతోనే గడిపారు. చిన్నపుడు ఆర్ధిక ఇబ్బందులతో ఆమె పదేళ్ళ వయసు నుంచే కష్టపడడం మొదలుపెట్టారు. అదే ఆమె జీవితాంతం కొనసాగింది. ఏది ఏమైనా స్మిత పాత పాటలను వెండి తెరపైన చూసినపుడు ఆమె విషాద మరణం  కూడా తప్పక గుర్తుకువస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: