'బాహుబలి' వంటి భారీ విజయం సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr సినిమాపై దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సపరేట్ మార్కెట్ ఏర్పరచుకున్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న rrr సినిమాని దాదాపు పది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రెండు పెద్ద హీరోలు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సారి కలిసి నటిస్తున్న నేపద్యంలో సౌత్ ఇండస్ట్రీ లోనే ఇది భారీ మల్టీస్టారర్ సినిమా అని అంటున్నారు చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు. సినిమాకి ఉన్న క్రేజ్ బట్టి రోజుకో వార్త ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది.

 

ఇదిలా ఉండగా తాజాగా బయటకు వచ్చిన వార్త ఏమిటంటే rrr సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయ్యిపోయిందని అలాగే చరణ్ సాంగ్ బిట్ కూడా పూర్తయ్యింది అని అలాగే ఎన్టీఆర్ మరియు తారక్ సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని వార్తలొస్తున్నాయి.అప్పుడే 80 శాతం షూటింగ్ అయ్యిపోయింది అంటే అది నిజంగానే నమ్మశక్యంగా లేదని చెప్పాలి.అందులోను రామ్ చరణ్ సాంగ్ అంటే అసలు నమ్మబుద్ది కావట్లేదు. దీంతో ఈ వార్త విన్న ఇద్దరు హీరోల అభిమానులు షాక్ అవుతున్నారు.

 

ఇంతకీ రాజమౌళి సినిమాలో ఎక్కువ భాగం టెక్నాలజీని వాడుతున్నారా లేకపోతే మనుషుల చేత షూటింగ్ చేస్తున్నారా అంటూ ఆశ్చర్యాన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. మల్లేశం సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అన్న విషయాలు అప్డేట్ చేస్తే బాగుంటుంది అంటూ ఇద్దరు హీరోల అభిమానులు సినిమా యూనిట్ కి సూచనలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమా మొదలు కాకముందే వచ్చే ఏడాది జులై చివరి వారంలో రాజమౌళి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో...తాజాగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే రాజమౌళి సినిమా షూటింగ్ విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: