అక్కినేని నాగార్జున చివరి హిట్ సినిమా సోగ్గాడు. ఆ సినిమా తర్వాత నాగార్జున నటించిన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను మరియు అభిమానులను అలరించ లేకపోయాయి. ఇటువంటి నేపథ్యంలో నాగార్జున తన కెరియర్ లో సూపర్ డూపర్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మన్మధుడు సినిమాకి సీక్వెల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ అనే సినిమా చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో అక్కినేని అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందారు. ఇటువంటి నేపథ్యంలో చాలా కథలు విన్న నాగార్జున నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని తాజాగా సల్మాన్ అనే కొత్త డైరెక్టర్ కి నాగార్జున అవకాశం ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

అంతేకాకుండా ఆ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో నాగార్జున కొత్త సినిమా గురించి లేటెస్ట్ వార్తగా ఇండస్ట్రీలో ఒక వార్త వినబడుతుంది. అదేమిటంటే తాజాగా కొత్త డైరెక్టర్ సల్మాన్ దర్శకత్వంలో నాగార్జున నటించబోయే సినిమాలో నాగార్జున హీరో కాదట .. కానీ కథ మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతుందనేది తాజా సమాచారం. అంటే ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రధారిగా మాత్రమే కనిపించనున్నాడన్న మాట. నాయకా నాయికలుగా ఒక యువ జంట కనిపిస్తుందని అంటున్నారు.

 

వాళ్లలో హీరో సంగతి తెలియదుగానీ, హీరోయిన్ గా మాత్రం కొత్త అమ్మాయినే తీసుకుంటారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం నాగార్జున సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్ సల్మాన్ తో చర్చలు జరుపుతున్నట్లు స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఓకే అయ్యాక అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: