అన్ని భాష‌ల్లోనూ బాగా క్రేజ్ వ‌చ్చిన టీ షో బిగ్‌బాస్‌. ఈ షో ముందు బాలీవుడ్‌లో మొద‌లై త‌ర్వాత నిధానంగా మిగ‌తా భాష‌ల్లోకి వ‌చ్చింది. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే 12 సీజ‌న్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 13వ సీజ‌న్ కూడా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిస్తుంది. కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌దీనికి హోస్ట్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఒక్కో సీజ‌న్ పెరిగే కొద్దీ ఆయ‌న రెమ్యూన‌రేష‌న్ కూడా అదే విధంగా పెంచుకుంటూ పోతున్నాడు స‌ల్మాన్. తాజాగా కండ‌ల‌వీరుడు తీసుకునే రెమ్యూన‌రేష‌న్ ఏకంగా 300 కోట్ల‌కు పైగా పారితోషికం అందుకుంటున్నాడు.

 

ఇక ఈ విష‌యం ఇలా ఉంటే ఇప్పుడు ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనారోగ్యం పాలైంది. తాజాగా హిందీ 13వ సీజన్‌లో పాల్గొన్న బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్య కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉంది. దాంతోపాటు తీవ్రమైన వెన్నునొప్పి కూడా ఉండటంతో షో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. మొన్నీమధ్యే ఓ టాస్క్ ఆడుతున్నపుడు అలాగే కింద పడిపోయింది దేవోలీనా. దీంతో ఆమె షో నుండీ బయటకు వెళ్ళిపోవాలనుకుంటుంది.. అదే విషయం నిర్వాహకులకు చెప్పి బయటికి వచ్చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు వైద్యం అందిస్తున్నారు. నొప్పి తగ్గిన తర్వాత వస్తుందేమో అనుకుంటే.. తాను పూర్తిగా షో నుంచి బయటికి రావాలనుకుంటున్నానని చెప్పడంతో అభిమానులు నిరాశ పడ్డారు.

 

ఇక ప్ర‌స్తుతం ఉన్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం ఆమెకే వ‌దిలేశారు నిర్వాహ‌కులు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో దేవోలీనా  చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈమె ఇలా మ‌ధ్య‌లోనే వెళ్ళిపోవ‌డం అనేది ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఈ విష‌యంలో ఫ్యాన్స్ చాలా బాధ‌ప‌డుతున్నారు. ఇ ఈ షోకి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి మ‌రో ఐదు వారాల‌పాటు పొడిగించారు నిర్వాహ‌కులు. ‘బిగ్‌బాస్‌’ కూడా ఆమెను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారట. హౌజ్‌లో ఉండే పనుల్లో పాల్గొనాలా వద్దా అనే నిర్ణయాన్ని కూడా ఆమెకే వదిలేశాడట. కానీ ఆమె ఇంకా కోలుకోలేకపోవడంతో … ‘వాలెంటరీ ఎలిమినేషన్‌’ తీసుబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: