తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ స్టార్ డం ని సంపాదించుకున్న కొందరి యంగ్ హీరోల పరిస్థితి ప్రస్తుతం మహా దారుణంగా ఉంది. వాళ్ళలో ముందుగా విజయ్ దేవరకొండ, నేచురల్ స్టార్ నాని పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటి అని నిర్మాతలు ధైర్యంగా ముందుకు వస్తారు. అంతేకాదు అదే దైర్యంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉత్సాహంగా నాని సినిమా రిలీజ్ చేయడానికి పోటీ పడతారు. అయితే ఇప్పుడు నాని పరిస్థితి ఏమంత బాగాలేదు. హిట్ కోసం బాగా తపిస్తున్నాడు. ఇక అర్జున్ రెడ్డి తో ఇండస్ట్రీలో సెన్షెషానల్ స్టార్ గా ఎదిగిన విజయ్ పరిస్థితి కూడా చెప్పలేకుండా ఉన్నాము. నోటా, డియర్ కామ్రెడ్ సినిమాలతో డిజాస్టర్స్ పడటం తో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మీద పడింది. 

 

సినిమా కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదని తాజా సమాచారం. ఇంతకముందు అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ కూడా వెనక్కి వెళ్ళాడట. ఇలా తెలుగు సినిమాలకు ఇక్కడే కాదు ఓవర్సీస్ లో మార్కెట్ తీవ్రంగా దెబ్బ తిన్నది. స్టార్ హీరోల క్రేజీ సినిమాలు అక్కడ చతికిల పడుతున్నాయి. కొందరు స్టార్ హీరోల సినిమాలు కొనే నాథుడు లేకపోవడంతో హీరోలు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణ గా రూలర్ సినిమాని చూపించవచ్చు. ఓవర్సీస్ రిలీజ్ లేకపోతే పరువు పోతుందనే ఆలోచనతో స్వయంగా రిలీజ్ చేయడమో లేదా తెలిసిన వారి చేతిలో పెట్టడమో చేస్తున్నారు. పైకి మాత్రం అంతకు అమ్ముడుపోయింది.. ఇంతకు అమ్ముడుపోయింది అని దర్జాగా చెప్పుకుంటున్నారు. ఇలా రిలీజ్ చేసినప్పుడు.. వారి సినిమా హిట్ అయితేనే కనీసం ఒక్క డాలర్ అయినా వస్తుంది లేకపోతే కలెక్షన్స్ మొత్తం సున్నా. 

 

స్టార్ హీరోల పరిస్థితే ఇలా ఉంటే కొత్త సినిమాలను.. స్టార్ కాస్ట్ లేని సినిమాలను.. చిన్న సినిమాలను ఓవర్సీస్ లో ఎవరు పట్టించుకోరు. తాజాగా 'మథనం' అనే సినిమాను అమెరికాలో మాత్రమే విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చెయ్యడం లేదు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే అసలు మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాలను వదిలేసి వస్తాయో రావో గ్యారెంటీ లేని అమెరికాపై మాత్రమే దృష్టి పెట్టడం మాత్రం వింతే.

 

ఇలా చేస్తే అసలు సినిమాపై పెట్టిన ఖర్చు వెనక్కు వస్తుందా? పోస్టర్ ఖర్చులైనా వస్తాయా? ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు.. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరన్నది ప్రేక్షకులకు తెలియదు. ప్రమోషన్స్ భారీగా చేస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఇలా ప్రేక్షకులు పట్టించుకోని చోట రిలీజ్ అంటే ఈ సినిమాను సరదా కోసం తీసినట్టున్నారు కానీ హిట్ చేసే ఉద్దేశంతో తీసినట్టు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ విషయం తెలిసిన కొందరు యంగ్ హీరోస్ మాకే దిక్క్కు లేదు ఇక మీకు ఎక్కడినుంచి వస్తాయి అని పెదవి విరుస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: