ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వ్యవహారాలు చూస్తుంటే బెట్టింగ్ విషయంలో క్రికెట్ నే మర్చిపోయోలా చేస్తున్నారు. ఇది నిజంగా దారుణమని చెప్పక తప్పదు. 2019 కి టాటా చెప్పి 2020కి వెల్ కం చెప్పేందుకు అందరు రెడీ అవుతున్నారు. తిప్పికొడితే నెల రోజులే ఉంది. ఈ నెలలో నాలుగు శుక్రవారాల్లో అదిరిపోయే ట్రీటిచ్చేందుకు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. డిసెంబర్ 13.. డిసెంబర్ 20.. డిసెంబర్ 25 తేదీల్ని కొన్ని భారీ సినిమాలు లాక్ చేసుకున్నాయి. వెంకీమామ-దబాంగ్ 3- స్టార్ వార్స్ లాంటి సినిమాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. అలాగే 2019 క్రిస్మస్ కానుకగా భారీ బెట్టింగ్ నడుస్తోందని తాజా పరిణామాలు చూస్తే తెలుస్తోంది.

 

అయితే కొత్త సంవత్సరంలో సంక్రాంతి పందెం ఏ రేంజులో ఉండబోతోంది? అంటే .. మార్కెట్ లెక్కల్ని పరిగణిస్తే దాదాపు 400-500 కోట్ల వరకు బెట్టింగ్ జరగబోతోందని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. 2020 సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. జనవరి 9 మొదలుకొని ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు వరుసగా రిలీజ్ కి లైన్ కడుతున్నాయి. ఈ సినిమాలలో ముందుగా కోలీవుడ్ సూపెర్ స్టార్ రజనీ 'దర్బార్' సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏకంగా 80 కోట్ల మేర బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రజనీ సినిమాకి తమిళంలో విపరీతమైన క్రేజు ఉన్నప్పటికి.. తెలుగులో మాత్రం అంతంత మాత్రమే. ఇక్కడ బిజినెస్ స్థాయి తక్కువగా ఉంటుంది. అదీకాకుండా వరుసగా కబాలి, కాలా, పేట పరాజయాన్ని అందుకున్నాయి. దాంతో ప్రస్తుతం రజనీకి తెలుగులో మార్కెట్ బాగా పడిపోయింది.  

 

ఇక ఆ తర్వాత జనవరి 11న వస్తున్న 'అల వైకుంఠపురములో'.. జనవరి 12న వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలకు భారీ బడ్జెట్లు కేటాయించారు. అందుకు తగ్గట్టే దాదాపు 150 కోట్ల బిజినెస్ చేసే కెపాసిటి మహేష్.. బన్ని సినిమాలకు ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా హైప్ బాగా నెలకొంది. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంత మంచివాడవురా' సినిమాకి 30 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దిల్ రాజు ఈ సినిమాకి పక్కా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇలా వీటన్నిటినీ కలుపుకుంటే 400-500 కోట్ల మేర బిజినెస్ సాగే వీలుందని అంచనా వేస్తున్నారు. అంత బిజినెస్ అంటే అన్ని సినిమాలు బాగా ఆడి అంతకు రెట్టింపు గ్రాస్ ని వసూలు చేయాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: