నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ ఏడాది అతడి నుండి వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మొన్న వచ్చిన గ్యాంగ్ లీడర్ ఫర్వాలేదనిపించినా జెర్సీ చిత్రం అతని కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా నిలిచిపోయింది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పర్చుకున్న నాని సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అందువల్లే తను ఎంచుకున్న కథలు విభిన్నంగా ఉంటున్నాయి.

 

సినిమా కథల్ని ఎంచుకునే విషయంలో నాని జడ్జ్ మెంట్ కరెక్ట్ గా ఉంటుందని చాలా మంది అభిప్రాయం. గ్యాంగ్ లీడర్ సినిమా విషయంలో కొంత పొరపాటు జరిగినా కూడా అది పెద్ద నష్టాన్ని మిగల్చలేదు. అయితే నాని ప్రస్తుతం మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. కొత్త కథతో విభిన్నమైన టైటిల్ తో "టక్ జగదీష్" అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది.

 


ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనేది టైటిల్. ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అందులో నాని ఫార్మల్ డ్రెస్లో టక్ చేసుకుని ఫోజిచ్చాడు. టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే సినిమాలో ఏదో కొత్త కాన్సెప్ట్ ఉందనే అనిపిస్తోంది. మరి టక్ చేసుకొచ్చిన నాని ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. పైగా శివ నిర్వాణ గతంలో నానితో ‘నిన్ని కోరి’ లాంటి హిట్ చిత్రం చేసి ఉండటంతో వీరి కాంబోపై అంచనాలు అధికంగా ఉన్నాయి. 

 

శివ నిర్వాణ తీసిన రెండు చిత్రాలు ఒకదానికి మించి మరోటి విజయం సాధించాయి. అందువల్ల ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.  ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథా నాయికలుగా ఇందులో రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: