కొన్ని కొన్ని సార్లు సినిమాలో చేసిన పాత్రల ద్వారా ఆ హీరోలకి గానీ, హీరోయిన్లకి గానీ పేరొస్తుంటుంది. సినిమాలో ఆ పాత్ర ఎంత బాగుంటే అంత పేరొస్తుంది. అలా తన పాత్ర ద్వారా క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. "ఆర్ ఎక్స్ 100" సినిమా ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న పాయల్ ప్రస్తుతం వెంకీ మామా అనే సినిమాలో నటిస్తుంది. అయితే ఆర్ ఎక్స్ 100 సినిమాలో కొంచెం బోల్డ్ గా ఉండడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర చేయడం వల్ల ఆ పేరు వచ్చిందనేది తెలిసిన విషయమే.

 

అయితే ఈ సినిమా తర్వాత ఆర్ డి ఎక్స్ లవ్ అంటూ మరలా సెక్స్ బాంబ్ పేల్చడానికి వచ్చినప్పటికీ ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకి నిరాశే మిగిలింది. సినిమా ఆడకపోగా పాయల్ రాజ్ పుత్ కి బీ గ్రేడ్ హీరోయిన్ అనేలా మచ్చ కూడా తెచ్చి పెట్టింది. పాయల్ ప్రస్తుతం చేస్తున్న వెంకీమామా డిసెంబర్ నెల 13 వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు సంక్రాంతి రేసులో వస్తాడనుకున్న వెంకీ మామా సడెన్ గా తన రూటు మార్చుకుని డిసెంబరు 13 వ తేదీకే ఫిక్సయ్యాడు. 

 

వెంకటేష్ లాంటి సీనియర్ నటుడి పక్కన పాయల్ రాజ్ పుత్ చేస్తుండడంతో ఆమె ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుందట. ఆర్ డి ఎక్స్ లవ్ ద్వారా వచ్చిన అపప్రద పోవడానికి వెంకీమామా ఉపయోగపడుతుందని ఆమె నమ్ముతుందట. అయితే వెంకీమామా చేయడం వల్ల ఆమె కల నెరవేరిందట. వెంకీమామ' సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ "నేను కలగంటున్నానేమో.. నన్ను గిల్లండి. వెంకటేష్ సర్ తో కలిసి నటించడం అనేది నా కల నిజమైనట్టు" అంటూ ఒక ట్వీట్  చేసింది.  దీంతోనే పాయల్ 'వెంకీమామ' పై ఎన్ని ఆశలు పెట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి సినిమా హిట్ అయ్యి ఆమె కల నెరవేరుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: