సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా మహా జోరుగా సాగుతుంది. ఇండస్ట్రీని ఏలిన నటీ నటుల పై వచ్చిన  బయోపిక్ లు బాక్సాఫీస్ ని బద్దలకొట్టాయి. ఇదే తరహలో రాజకీయ నాయకులపై, క్రీడాకారులపై వచ్చిన బయోపిక్ లు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయనే చెప్పొచ్చు. స్పోర్ట్స్ క్రీడాకారుల జీవితాలగురించి  వచ్చిన బయోపిక్ లు కూడా చాలానే ఉన్నాయి. అదే బాటలో ప్రస్తుతం మొట్టమొదటి సారిగా ఒక లేడీ క్రికెటర్ కి సంబంధించిన బయోపిక్ ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది.


క్రికెట్ ఆటలో తనకంటూ ఒక ప్రత్యకమైన స్థానాన్ని ఏర్పచుకున్న మిథాలిరాజ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ తాప్సిని కథానాయకిగా ఎంచుకున్నారు. నేడు మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్బంగా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. మిథాలీ పాత్రలో తాప్సి నటిస్తుండగా షారుక్ ఖాన్ నటించిన రాయిస్ సినిమా దర్శకుడు రాహుల్ దొలాకియా ఈ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమాకు 'శబాష్ మిథు' అనే టైటిల్ ని కూడా అనుకున్నారట.


వైకామ్ 18 స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధమైంది.  అసలైతే ఈ ఏడాది మొదట్లోనే సినిమా ప్రారంభించాలనుకున్నారు.. కాని స్క్రిప్ట్ పని అవకపోవడం వల్ల సినిమా పనులు కొంచం ఆలస్యంగా మొదులు పెట్టనున్నారు. మొత్తానికి 2020 లో ఈ సినిమా ప్రేక్షల ముందుకు రానుంది. 


అయితే సినిమాలో నటిస్తున్న కథానాయిక  తాప్సి క్రిడాకారిణి మిథాలిరాజ్ తో కొంతకాలంగా ట్రావెల్ చేస్తున్నారు. ఆమె రోజువారి అలవాట్లు, ఆమె ప్రవర్తన ఇలాంటిని అవగాన చేసుకుంటుంది. ఆమె క్రికెట్ ను ఎలా ఆడిందో.. వంటి విషయాలపై చాలా ఇంట్రస్ట్ గా మిధాలిరాజ్ ను ఫాలో అవుతుంది. 
అంతేకాందండోయ్ తాప్సి క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంటుందట.. మరి ఈ భామ ఎంత వరకు పాత్రలో జీవిస్తుందో.. సినిమాను వెండితెరపై ఎంతగా రక్తి కట్టిస్తుందో వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: