అందాల భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు పొదుపైన ఆచ్ఛాదనలతో సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. పెళ్లి అయినప్పటి నుంచి వెండితెరకు దూరమైన ఈ భామ బుల్లితెరపై కొన్ని ప్రోగ్రమ్స్ లో కనిపిస్తుంది. 

 

చాలా గ్యాప్ తరువాత ఈ భామ మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఉన్న యంగ్ స్టర్స్ తో పోటీపడి పోటీపడటం అంత ఈజీ టాస్క్ కాదు. గ్లామ‌ర్ పాత్ర‌లు చేసే వ‌య‌సు దాటిపోయింది. అలాగని అక్క, అమ్మ పాత్రలు చేయలేదు.  లేడీ ఓరియెంటెడ్  చిత్రాలే ఎంచుకోవాలి. అయితే ఆ త‌ర‌హా క‌థ‌ల‌కు మెల్ల‌మెల్ల‌గా కాలం చెల్లిపోతోంది.


స్టోరీలో ఎంతో కొంత వైవిద్యం ఉంటే తప్ప ప్రేక్షకులు సినిమాలను ఆదరించడంలేదు. అయితే ప్రస్తుతం లేడీఓరియంటెడ్ మూవీస్ కి కూడా మార్కెట్ లో అంత క్రేజ్ లేదనే చెప్పాలి.  ఇలాంటి టైంలో ప్రియమణికి ఒక మంచి ఆఫర్ వచ్చింది. సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర లాంటిదే. ఈ సినిమాతో ప్రియమణి పేరు మళ్లీ ఇండ్రస్ట్రీ లో మారుమ్రోగే అవకాశం ఉంది. ఆ పాత్ర ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం "తలైవి"


ఈ చిత్రంలో ప్రియమణి "శశికళ" పాత్ర పోషించనుంది. శశికళ జయలలిత జీవితంలో చాలా ముఖ్య వ్యక్తి. ఆమె జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి. దీంతో ఈ పాత్రను వెండి తెరపై ఏవిధంగా డిజైన్ చేయబోతున్నారని తమిళనాట ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రలో ప్రియమణి నటించబోతుంది. "తలైవి" సినిమా కోసం దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ దాదాపు తొమ్మిది నెలలపాటు రీసెర్చ్ చేశారు. ఆమె జీవితం ఆమె జీవితం గురించి ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

 

జయలలితగా కంగన నటిస్తుండగా.. ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. తమిళ, హిందీ,
తెలుగు భాషల్లో సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో "తలైవి" గా, హిందీలో "జయ"గా సినిమా విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: