జెర్సీ వంటి ఎమోషన్ డ్రామా తర్వాత నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 25వ సినిమా 'వి' షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో నాని నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. ఇంకా ఆ విషయంలో క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇప్పటికే ఇది నిజమని అందరు గట్టిగా ఫిక్సైపోయారు. ఇక నానిసినిమా తర్వాత చేయబోతున్న సినిమాపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.  నాని తో 'నిన్ను కోరి...సమంత-నాగ చైతన్యల తో మజిలీ వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ తో నాని మరోసారి జత కట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

 

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చిన విషయం తెల్సిందే. నానికి జోడీగా ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు నటించబోతున్నారు. ఇక ఈ సినిమా గోదావరి నేపథ్యంలో రూపొందబోతుందంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండానే ఈ సినిమా టైటిల్ అంటూ సినీ వర్గాల తో పాటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాని 26 టైటిల్ 'టక్ జగదీష్' అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది.

 

సోషల్ మీడియాలో ఈ టైటిల్ అప్పుడే తెగ హడావుడి చేసేస్తుంది. ఈ టైటిల్ పై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే మరికొందరు మాత్రం ఇదేం టైటిల్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం శివ నిర్వాణ గత సినిమా టైటిల్స్ 'నిన్ను కోరి' 'మజిలీ' టైటిల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఇదేంటి నాని సినిమా టైటిల్ ఇలా ఉంది.. అసలు ఇది నిజమైనా టైటిల్ అయ్యి ఉంటుందా లేదంటే పుకార్లా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ ఫ్రీ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు కాబట్టి  ఇదే ఫైనల్ టైటిల్ అని క్లియర్ గా తెలుస్తోంది. ఇక శివ నిర్వాణ ముందు తీసిన రెండు సినిమాలు మంచి సక్సస్ ని అందుకున్నాయి. మరీ ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకుంటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: