ప్రముఖ గాయని గాన కోకిల లతా మంగేష్కర్ గత నెల 11న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్న లతాజీని ఆమే కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లోని ఇంటెన్సీవ్ కేర్ లో చేర్చించారు. అప్పటి నుంచి ఆవిడ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో అనవసరమైన ఊహాగానాలు మొదలయ్యాయి. లతాజీ ఇక కష్టమే అని షోషల్ మీడియా వేదికగా జోరుగానే ప్రచారం కూడా జరిగింది. దాంతో లతా మంగేష్కర్ అభిమానుల్ని కలవరపాటుకు గురిచేశాయి. ఎంతోమంది అభిమానులు తన కోసం ఆవేదన చెందారు.

 

అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లతా మంగేష్కర్ అభిమానులు భారతరత్న.. మేటి గాయని.. బ్రతకాలని.. క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని ప్రార్థించారు. గత ఏడు దశాబ్దాలుగా గాయనిగా అలుపెరగకుండా కళ్ళామ తల్లికి సేవలందిస్తు, ప్రేక్షకులను అలరిస్తున్న లత మంగేష్కర్ ఇప్పటి వరకు 30 వేలకు పైగానే అద్భుతమైన పాటలు పాడారు. గాన కోకిలగా పేరుతెచ్చుకున్న ఆమె పాట బాలీవుడ్ లో ఇప్పటికి ఎవర్ గ్రీన్ అని అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి లతా మంగేష్కర్ అస్వస్థకు గురి కావడం దేశ వ్యాప్తంగా వున్న లతా అభిమానుల్నికలవరానికి గురిచేసింది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా వుందని తేలడంతో అందరు స్థిమితంగా ఊపిరి పీల్చుకున్నారు.

 

ఇక తన అభిమానులను ఉద్దేశించి మీ ప్రార్థనలే బతికిచాయి. నేను బతికానంటే అందుకు కారణం మీ ప్రార్థనలే. నా అభిమానులకు ఎప్పటికి రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా గాన కోకిల లతా మంగేష్కర్.. ఆమె కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతగా తన అభిమానులను గుర్తుంచుకుని కృతజ్ఞతలు తెలపడం నిజంగా గొప్ప విషయం. ఇక లతాజీ తిరిగి గొంతు సవరించుకుని పాడేంతగా హుషారుగానే ఉన్నారన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: