కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో మంచి పేరు సంపాదించిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. కొన్నేళ్ల క్రితం మొదట మాయాజాలకుడిగా వృత్తిని కొనసాగించిన సుధీర్ కు అనూహ్యంగా ఈటివి ఛానల్ లో అవకాశం రావడంతో, ఆ తరువాత వారు నిర్వహించిన జబర్దస్త్ షోలో తన టాలెంట్ తో చిన్న ప్లేస్ సంపాదించాడు సుధీర్. ఆ తరువాత మెల్లగా తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆనతికాలం లోనే జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించడంతో పాటు ఏకంగా ఒక టీమ్ ని కూడా తన పేరుతో ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాడు. 

 

అయితే ఆ షోలోనే యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలెట్టి మంచి పేరు సంపాదించిన యాంకర్ రష్మీకి ఆ తరువాత పలు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం జరిగింది. కాగా కొన్నాళ్ల నుండి సుధీర్ కు మరియు రష్మీకి మధ్య ప్రేమాయణం నడుస్తుందని, అలానే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు పుకార్లు కూడా చెలరేగాయి. అయితే అటువంటిది ఏమి లేదని వారు ఎన్నిసార్లు వాటిని కొట్టి పారేసినప్పటికీ కూడా ఆ పుకార్లకు అడ్డు కట్ట పడలేదు. ఇక ఇటీవల ఆలీతో సరదాగా షోకి విచ్చేసిన సుధీర్ కి సంబంధించి ప్రోమో నిన్న రిలీజ్ అయింది. అందులో భాగంగా, ఒకవేళ నీకు ఎదురుగా దీపికా పదుకొనె, కరీనా కపూర్ వచ్చి నిలబడితే వారిద్దరిలో ఎవరిని నువ్వు ముందుగా హగ్ అడుగుతావు అంటూ ఆలీ వేసిన ప్రశ్నకు సుధీర్ సమాధానం ఇస్తూ, 

 

ఇంతకూ రష్మీ ఎక్కడ ఉంది అని వారిని అడుగుతానని అన్నాడు. దానితో షో మొత్తం ఒక్కసారిగా నవ్వులతో హోరెత్తింది. కాగా ఈ షో పూర్తి కార్యక్రమం అతి త్వరలో ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాటర్ రష్మీ వరకు చేరడంతో కొంత ఆగ్రహించిన రష్మీ, సుధీర్ కు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇకపై తన అనుమతి లేకుండా ఈ విధంగా షోల్లో తన పేరు తీసుకువస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు నేడు పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. దానితో వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని అంటున్నారు. అయితే ఈ ఘటన పై అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, సుధీర్ బాక్సు బద్దలైనట్లే అని అంటున్నారు ప్రేక్షకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: