బాలీవుడ్ లో అతి తక్కువకాలంలోనే హీరోయిన్స్ అందరికంటే ఆలియ భట్ ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. ఇంత త్వరగా బాలీవుడ్ లో హీరోయిన్స్ ఇంత గట్టి పోటీ ఇస్తుందని ఎవరూ ఊహించనేలేదు. రాజీ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు పురస్కారాల్ని దక్కించుకుంది. అందుకే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కోసం ఏరికోరి మరీ ఆలియ ను సెలెక్ట్ చేసుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు (రామ్ చరణ్) సరసన సీతగా నటిస్తోంది. నర్సీపట్నం సమీపంలోని కేడి పేట పరిసరాల్లో కొండ కోనల్లో సంచరించి ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి పోరాటం తెలిసిందే. విప్లవం కోసం ప్రాణం పెట్టిన వీరుడికి భార్యగా ఆలియా భట్ ఆర్.ఆర్.ఆర్ లో ముఖ్యమైన పాత్ర లో కనిపించనుంది.

 

మరోవైపు ఆలియా బాలీవుడ్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇంత బిజీ షెడ్యూల్స్ లో నూ నిరంతరం ఏదో ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్ కి హాజరై మెరుపులు మెరిపిస్తూనే ఉంది. తాజాగా ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ 2019 కార్యక్రమంలోనూ ఆలియా తళుక్కున మెరిసి తన గ్లామర్ తో అందరికి అదిరిపోయో షాకిచ్చింది. ఈ వేడుకల్లో బ్లాక్ డిజైనర్ స్లిట్ (పాయలుగా విడిపోయిన) డ్రెస్ లో షో స్టాపర్ గా నిలిచింది. వేడుక ఆద్యంతం యూత్ కళ్లన్నీ ఆలియాపైనే ఉన్నాయట. నవ్వితే చిల్లులు పడే ఆ బుగ్గల్లోని సొట్టలి అంతే ఆకర్షణీయంగా ఈ వేడుకలో కనిపించాయట. 

 

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆలియాతో పాటుగా వరుణ్ ధావన్ ఇతర బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ఇక ఆలియా బాలీవుడ్ లో నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర త్వరలోనే రిలీజ్ కాబోతోంది. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా.. ఆర్.ఆర్.ఆర్ లో ఎంతో కీలకమే కాదు...సినిమాలోనూ ఎంతో హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: