దర్శక, నిర్మాతల ఒత్తిడి ఉంటే తప్ప, సాధ్యమైనంతవరకు దేవిశ్రీప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా  తీసుకుంటాడు బోయపాటి. సరైనోడులో పాటలు సూపర్ గా ఉంటాయి. అన్నీ మ్యూజికల్ హిట్సే. అయినప్పటికీ తన నెక్ట్స్ సినిమాలకు తమన్ ను రిపీట్ చేయలేదు. దేవిశ్రీనే తీసుకున్నాడు. బోయపాటి తీసిన జయజానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలకు డీఎస్పీనే మ్యూజిక్. ఈ రెండు సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అని అందరికి తెలిసిందే.

 

అయితే ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు బోయపాటి. కెరీర్ స్టార్టింగ్ నుంచి తను తెరకెక్కించిన సింహా, దమ్ము, సరైనోడు సినిమాలు తప్ప మిగతా అన్ని సినిమాలకు దేవిశ్రీనే రిపీట్ చేస్తున్న బోయపాటి, ఈసారి మాత్రం కొత్త సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. బోయపాటి తెరకెక్కిస్తున్న నెక్స్ట్ సినిమాకు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతున్న తాజా సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం ఈ కంపోజర్ మంచి ఊపుమీదున్నాడు. తమన్ ఎలాంటి సాంగ్స్ ఇస్తాడనే విషయాన్ని పక్కనపెడితే, ఇలాంటి రైజింగ్ హ్యాండ్స్ ను తన టీమ్ లో ఉంచుకోవడం స్వతహాగా బోయపాటికి ఇష్టం. అందుకే దేవిశ్రీ స్థానంలోకి తమన్ వచ్చి చేరాడు. 

 

ఇంతకుముందే చెప్పినట్టు తమన్ తో సరైనోడు సినిమాకు వర్క్ చేశాడు బోయపాటి. సో.. ఆ మేజిక్ ను బాలయ్య సినిమాతో రిపీట్ చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి నెమ్మదిగా దేవిశ్రీ అవకాశాలకు గండికొట్టడం మొదలు పెట్టాడు తమన్. ఇక రీసెంట్‌గా ఈ మ్యూజిక్ డైరెక్టర్ రీ మిక్స్ సాంగ్స్ చేయనని వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థమన్ అల్లు అర్జున్-త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమాకి సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. వాస్తవంగా చూస్తే ఈ సినిమాకి దేవీ నే మ్యూజిక్ కంపోజ్ చేయాలి. ఇంతకముందు బన్నీ- త్రివిక్రం కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకి దేవీనే మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఈ హ్యాట్రిక్ సినిమాకి మాత్రం దేవీ మిస్సయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: