కార్తికేయ మొదటి సినిమా 'ప్రేమతో మీ కార్తీక్'. కానీ ఈ సినిమా ఎవరికి గుర్తులేదు. అసలు అలాంటి సినిమా ఒకటుందా అని కూడా అనుమానం వస్తుంది. అయితే ఆర్.ఎక్స్ 100 సినిమాతో మాత్రం ఇండస్ట్రీలో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. హీరోయిన్ పాయల్ తన అందాలతో, మత్తెక్కించే నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అంతే కార్తికేయ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కార్తికేయ ఇండస్ట్రీలో సెటిలైపోయాడని అందరు ఊహించారు. కానీ ఆ తర్వాత వచ్చిన హిప్పీ, గుణ 369 ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అంతేకాదు నాని గ్యాంగ్ లీడర్ లో చేసిన నెగిటివ్ రోల్ కూడా కార్తికేయకు నిరాశనే మిగిల్చింది. మరి ఈ రకంగా చూస్తే ఇప్పటి వరకు కార్తికేయ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్క ఆర్.ఎక్స్ 100 మాత్రమే. 

 

సినిమా కార్తికేయకి యూత్ లో భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఆ క్రేజ్ కాస్త ఆ తరువాత వచ్చిన హిప్పీ- గుణ 369 చిత్రాలు ఘోరంగా దెబ్బతీశాయి. మొత్తంగా ఈ కుర్ర హీరో ఇమేజ్ ని సున్నా చేశాయి. ఇక తాజాగా కార్తికేయ నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై యూత్ లో కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. కథ వినే కార్తికేయసినిమా కమిటయ్యాడా లేక తనమీద తనకి అతి నమ్మకంతో సినిమా చేశాడా అని చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఇమేజ్ మొత్తం తనకు తానుగా ఇలాంటి కంటెంట్ లేని సినిమాలని ఒప్పుకొని నాశనం చేసుకున్నాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 

 

ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఇది ముమ్మాటికి కార్తికేయ పొరపాటేనని. ఇన్ని సినిమాలు చేసినా ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారో ఎలాంటి కథలు తనకు నప్పుతాయో ఇంకా తెలుసుకోకపోవడం అవివేకమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రకంగా చూస్తే ఇలాంటి కథల్లో తను సూటవౌతాడని ఒప్పుకోవడం తన చూపుడు వేలుతో తన కన్ను తానే పొడుచుకున్నట్లు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కార్తికేయకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది కానీ తనే దాన్ని నాశనం చేసుకుంటున్నాడని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: