ప్రతి శుక్రవారం థియేటర్ల ముందు కాపు కాసే ప్రతి సినిమా పిచ్చోడికి ఇది ఒక శుభవార్త. ప్రతిసారి వంద రూపాయలకు పైగా డబ్బులు పెట్టి టికెట్టు కొనుక్కున్న ఉన్నవారందరూ ఇంటర్వెల్ లో థియేటర్లో వారు అమ్ముతున్న స్నాక్స్ యొక్క రేటు చూసి బెంబేలెత్తిపోతున్నారు. కనీసం వాటర్ బాటిల్ కొందామన్నా కూడా 50 రూపాయల వరకు వసూలు చేస్తారు థియేటర్ వారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే కొత్తగా ఒక రూలు వచ్చేసింది. మనం ఇప్పుడు భోజనాన్ని మరియు నీటిని ఇంటినుండే సినిమా థియేటర్ లోకి నిరభ్యంతరంగా తీసుకొని వెళ్లొచ్చు.

 

అవినీతి నిరోధక కార్యకర్త విజయ్ గోపాల్ కంప్లైంట్ ఇచ్చిన ఆధారంగా హైదరాబాద్ సిటీ పోలీసు వారు ఇకనుండి ప్రజలందరూ ఎటువంటి ఆటంకం లేకుండా తమ ఇంటి నుండే స్నాక్స్ మరియు నీటిని థియేటర్లోకి తీసుకువెళ్లేందుకు అనుమతినిచ్చారు. అలాగే థియేటర్ వారికి కూడా ప్రేక్షకులు తీసుకొని వెళుతున్న ఏ ఒక్క ఆహార పదార్థాన్ని బయట ఆపేందుకు కూడా ఎటువంటి అధికారం లేదని తేల్చి చెప్పారు. అసలు ఈ చట్టం ఇప్పుడు కొత్తగా వచ్చిన అయితే కాదు. సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 ప్రకారం ప్రేక్షకులు సినిమా థియేటర్లో సినిమా చూడడానికి వచ్చినపుడు వారు తీసుకుని వచ్చే తిను బండారాలు మరియు వాటర్ బాటిల్ పైన ఎటువంటి ఆంక్షలు విధించకూడదు అని రాసి ఉంది.

 

ఇకపోతే మల్టీప్లెక్స్ లో దీనికి విరుద్ధంగా ఎంతో మంది ప్రేక్షకులను లోనికి ఆహారాన్ని తీసుకొని వెళ్ళనీయకుండా తమ రక్షణ వ్యవస్థ కోసం అని సాకులు చెబుతూ ఆపేస్తూ ఉంటారు. అయితే అందుకు గల కారణం సినిమా హాల్లో వారు కాంట్రాక్ట్ తీసుకున్న వారితో అధిక రేట్లకు కూల్ డ్రింక్స్ మరియు స్నాక్స్ అమ్మించడం వల్ల వచ్చే లాభాలను నష్ట పోకుండా ఉండేందుకు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాగే కొత్తగా వచ్చిన ఇంకొక చట్టం ఏమిటంటే ఓకే స్క్రీన్ ఉన్న థియేటర్లలో ప్రేక్షకుడికి 3D గ్లాస్ అద్దాలు వాడేందుకు ఎటువంటి చార్జి చేయకూడదు. అలాగే మల్టీప్లెక్స్ లలో వారు థియేటర్ వారి వద్ద 3-D గ్లాసులు తీసుకోకపోతే వారి సొంత వాటిని తెచ్చుకునేందుకు కూడా ఎటువంటి అభ్యంతరము ప్రకటించరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: