రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్ నాగచైతన్య కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం వెంకీ మామా. డిసెంబర్ ౧౩ వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో వెంకటేష్ రైతుగా కనిపిస్తే అల్లుడిగా నటించిన చైతన్య బోర్డర్ లో ఫైట్ చేసే ఆర్మీ ఆఫీసరుగా కనిపించనున్నారు. అయితే ఆర్మీ ఆఫీసరుగా చైతు చేసే యాక్షన్ సిన్లు చాలా మెప్పిస్తాయట.
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన హిందీ సినిమా యురి.. ది సర్జికల్ స్ట్రైక్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. పెద్దగా పేరులేని నటీనటులు, టెక్నీషియన్లు కలిసి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగించింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల మీద భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా సినిమాను నడిపించడం ప్రేక్షకులు భలేగా కనెక్టయ్యారు. వెంకీ మామా సినిమాలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ ఫైట్ ఉంటుందట.
యూరి సినిమాలో మాదిరిగా ఉండే ఈ ఫైట్ సీన్స్ చాలా ఇంటెన్స్ తో కూడుకుని ఉంటాయట. ఆ సినిమాలోని యాక్షన్ సీన్స్ స్ఫూర్తితోనే ఈ సినిమాలో ఆర్మీ సీన్స్ డిజైన్ చేశారట. ఇలాంటి ఫైట్ సీన్సే మహేష్ నటించిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో కూడా ఉంటాయట. కానీ అవి అంత సీరియస్ గా ఉండవని సమాచారం. వెంకీ మామా సినిమా మొత్తం ప్రేక్షకులని నవ్విస్తుందట. కానీ ఈ ఫైట్ మాత్రం చాలా సీరియస్ గా ఉండి ప్రేక్షకలకి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందట.
ఈ సీన్ కి సంబంధించిన సన్నివేశాల గురించి ట్రైలర్ లో కూడా చూపించారు. చైతూ మాట్లాడే మాటలు సినిమాలో యురి లాంటి సీన్స్ ఉంటాయని చెప్తుంది. మరి సినిమాలో ఆ యాక్షన్ సన్నివేశాలలు ఎలా పేలతాయో చూడాలి.