వరస ఫ్లాఫులతో బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ షారూక్. ఒకదాని తర్వాత మరోటి, ఒక దానికి మించి మరోటీ ఫ్లాప్ లే షారూక్ ను కిందకి లాగేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన పరిస్థితిపై తనే జాలి ప్రకటించుకున్నారు షారూక్. ' ఇలా వరస ఫ్లాప్ లు వస్తే.. ఇక తనకు సినిమాల అవకాశాలు ఉండవేమో..' అని కొన్నాళ్ల కిందట షారూక్ తనకు తానే సెటైర్ వేసుకున్నాడు. నిజమే అక్షయ్ కుమార్ లాంటి హీరో సామాజిక అంశాలతో గత రెండేళ్ళుగా వరుస హిట్స్ అందుకుంటు జోరు మీద ఉన్నాడు. ఈ మధ్య కాలంలో విపరీతంగా మార్కెట్ ని పెంచుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో కంటిన్యూ హిట్స్ ఇస్తుంది ఎవరంటే అక్షయ్ కుమార్ అనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలోనే షారుక్ కాస్త డీలా పడుతున్నాడు.  

 

ఆ తర్వాత కూడా ఈ హీరోకి హిట్ కలిసి రాలేదు. 'జీరో' రూపంలో మరో పెద్ద ఫ్లాపే మిగిలింది. షారూక్ తన కెరీర్ లో ఎన్నడూ ఎదుర్కోని స్థాయిలో ఇలా వరస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నాడు. వాస్తవంగా షారుక్ ఇంత ఫ్రీక్వెంట్ గా ఫ్లాప్స్ ని చూడటం తన మొత్తం సినిమా కెరీర్ లో ఇదే మొదటి సారి. ఇలాంటి క్రమంలో తన పరిస్థితిపై మరోసారి తనే జాలిని ప్రకటించుకున్నాడు షారూక్. 'మేం కథలను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడంలో విఫలం అవుతున్నాం..' అని షారూక్ వ్యాఖ్యానించాడు. తన ఫ్లాఫులపై ఈ ప్రకటన చేశాడు ఈ బాలీవుడ్ హీరో. 

 

ఇక షారూక్ నెక్స్ట్ సినిమా ఏదనేది కూడా ఇంకా మిస్టరీనే. తన నెక్స్ట్ సినిమా కోసం షారూక్ దర్శకుడి వేటలో ఉన్నాడు. అయితే ఒక సినిమాలో ప్రత్యేక పాత్రను మాత్రం చేయబోతున్నాడు. చాలా మంది బాలీవుడ్ స్టార్ ల కలయికతో రూపొందబోతున్న 'బ్రహ్మస్త్ర' లో షారూక్ ఒక ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ఇది బ్లాక్ బస్టర్ అయినా షారుఖ్ కి ఒరిగేదేమి ఉండదు.  ఇక ఆ మధ్య షారుక్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడన్న వార్త అటు బాలీవుడ్ లోనూ ఇటు కోలీవుడ్ లోనూ బాగా ప్రచారమైంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న విషయం లో ఇప్పటి వరకు అసలు క్లారిటి లేదు. మరి షారుక్ కొత్త సినిమా విశేషాలను త్వరలో ప్రకటిస్తే ఫ్యాన్స్ ఆనందపడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: