పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ డిజాస్టర్ లతో ఉన్న సమయంలో హరీష్ శంకర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' కథ ఆధారంగా… గబ్బర్ సింగ్ అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. దీంతో అదే సమయంలో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో 'దబాంగ్ 2' సినిమా చేయడంతో పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' అనే స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది. అయితే ఆ సినిమాని మొదట సంపత్ నంది అనే డైరెక్టర్ తో చేయాలని భావించినా తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల డైరెక్టర్ బాబీతో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా పవన్ కళ్యాణ్ చేశారు. కాగా ఇటీవల విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్య ఇద్దరితో వెంకీ మామ అనే సినిమా డైరెక్టర్ బాబీ తెరకెక్కించడం జరిగింది.

 

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా మరికొద్ది రోజుల్లో వెంకీ మామ అనే సినిమా విడుదల రాబోతున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా తాను దర్శకత్వం చేసిన సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా గురించి మాట్లాడుతూ..  సినిమా ఇండస్ట్రీలో అపజయాలు ఖాయమని, ఏ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరని.. 'సర్దార్' ఫలితం గురించి తాను అసలు బాధ పడలేదని బాబీ స్పష్టం చేశాడు.

 

అది తాను కావాలని చేసిన సినిమా కాదని, పవన్ తనను ఎన్నుకున్నాడని అన్నారు. అంతేకాకుండా తాను పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద ఫ్యాన్ అని జీవితంలో పవన్ కళ్యాణ్ తో ఫోటో అయినా దిగితే బాగుండేది అని డైరెక్టర్ కాకముందు నాకు కోరిక ఉండేది.. కానీ అటువంటి వ్యక్తి తో సినిమా చేయడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకమని రెండు సంవత్సరాల పాటు సినిమా షూటింగ్ జరిగిన సమయంలో ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను అంటూ డైరెక్టర్ బాబి పేర్కొన్నారు. కాబట్టి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాక రిజల్ట్ పెద్ద మేటర్ కాదని బాబి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: