ఆదివారం నాడే 'అలా వైకుంఠపురం లో' టీజర్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సందర్భంలో మెగా కుటుంబానికి చెందిన మెగా అభిమాని హైదరాబాద్ కి చెందిన వ్యక్తి ఒకరు మరణించడంతో టీజర్ వాయిదా వేయడం జరిగింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఆవురావురుమంటూ అల్లు అర్జున్ అభిమానులు 'అల వైకుంఠ పురం లో' సినిమా టీజర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు సినిమా యూనిట్  టీజర్ విడుదల చేయడం జరిగింది. దీంతో అలా విడుదల చేశారు లేదో 7 నిమిషాల్లో ఇంటర్నెట్ లో సరికొత్త రికార్డు బ్రేక్ చేసింది.

 

విషయంలోకి వెళ్తే సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి మాస్ స్టోరీతో క్లాసికల్ టచ్ లో ప్రజెంట్ జనరేషన్ కి దగ్గరగా ఉండే తరహాలో సాఫ్ట్వేర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తూ టీజర్ లో తన బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టే స్టైల్ తో కనబడిన కొద్ది నిమిషాల్లోనే బాగా ఆకట్టుకున్నాడు. దీంతో టీజర్ విడుదల అయిన ఏడే ఏడూ నిమిషాల్లో మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని అలా కొత్త రికార్డుని సెట్ చేసింది. టీజర్ చాలా బాగా ఆకట్టుకుంది ... లేట్ అయినా గాని అదరగొట్టే రేంజిలో టీజర్ వుందని అభిమానులు అంటున్నారు 

 

మొత్తం మీద సోషల్ మీడియాలో తనకు ఎదురు లేదు అన్నట్టుగా అల్లు అర్జున్ ఇప్పటిదాకా పాటలతో సెన్సేషనల్ రికార్డులు కొన్ని గంటల్లో క్రియేట్ చేయగా తాజాగా 'అలా వైకుంఠపురం లో' సినిమా టీజర్ తో కొద్ది నిమిషాల్లోనే ఇంటర్నెట్ లో రికార్డులు క్రియేట్ చేయడం తో ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ సంక్రాంతికి పక్క మాస్ మసాలా లాంటి హిట్ ప్రేక్షకులకు ఇవ్వడంతోపాటు త్రివిక్రమ్ మరియు బన్నీ కలిసి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఇండస్ట్రీకి చెందిన వారు సినిమా టీజర్ చూసి కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: