ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. అత్యంత భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు. 
అలానే హీరోయిన్స్ గా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.

 

ఇప్పటికే 75 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి నిన్న ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న లుక్ తాలూకు వీడియో లీక్ అయి పలు సోషల్ మీడియా మద్యమాల్లో వైరల్ అయింది. దానితో సినిమా యూనిట్ ఇకపై ఎంతో కఠినంగా వ్యవహరిస్తూ, షూటింగ్ స్పాట్ కు సెల్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకురావడం పూర్తిగా నిషేధించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకరిని తీసుకున్నారని, 

 

అయితే ఆ క్యారెక్టర్ ని సినిమా రిలీజ్ వరకు సస్పెన్స్ లో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఆమె ఎవరు, సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏమిటి అనేది ఇప్పటివరకు బయటకు రానీయలేదని అంటున్నారు. అయితే కొందరు సినిమా సిబ్బంది నుండి ఈ న్యూస్ రహస్యంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త పై ఆర్ఆర్ఆర్ యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతన్న ఈ వార్త కనుక నిజమే అయితే, ఆ హీరోయిన్ పంట పండినట్లే అని అంటూ పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: