రాజమౌళి పేరు వినని వారు ఎవరు ఉండరు.. బాహుబలి లాంటి పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి...ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.. ఇద్దరు బడా హీరోస్ తో ఏంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమా మీద అందరు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..

సినిమా విషయంలో రాజమౌళి ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఎటువంటి లీక్స్ అనేవి జరగకుండా చాలా పగడ్భందిగా ఉన్నారట.. కాని ఎంత జాగ్రత్త తీసుకున్న ఈ రోజుల్లో షూటింగ్ జరుగుతుంటేనే మొబైల్ లో షూట్ చేసి నెట్లో పెట్టేస్తున్నారు. అపుడు బాహుబలి సినిమా విషయంలో కూడా అలానే ఒక సీన్ లీక్ అయింది. దానితో చాలా జాగ్రత్త పడ్డారు. కాని మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది..

రాజమౌళి తీస్తున్న అతి పెద్ద మల్టీస్టార్ సినిమా అయిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఫొటోస్ ఇపుడు నెట్లో ప్రత్యక్షం అయ్యాయి... ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫొటోస్ ఇపుడు లీక్ అయ్యాయి. నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ ఫొటోస్ లీక్ అవ్వడం పై రాజమౌళి చాలా సీరియస్ అయ్యారట. ఎన్టీఆర్ ఫొటోస్ ఎలా లీక్ అయ్యాయి? సెట్లో అసలు ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీస్తున్నారు.

 

 అసలు షూటింగ్ స్పాట్ కి మొబైల్ ఫోన్స్, ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటివి తీసుకురానివ్వకుండా ముందే జాగ్రత్త పడ్డారట. కాని ఫలితం లేదు.. లీకేజ్ విషయంలో సీరియస్ అయిన రాజమౌళి షూటింగ్ స్పాట్ లో ఒక ప్రత్యేకమైన టీం ని సీక్రెట్ గా పెట్టాలని ఆలోచనలో ఉన్నారట. రాజమౌళి అనుమతి లేనిదే ఎవరు లోపలికి రాకూడదని ఆర్డర్ వేసారట. ఒక్క ఎన్టీఆర్ మరియు రాంచరణ్ మినహాయించి ఎవరయినా లోపలికి వెళ్ళేటపుడయినా బయటకి వచేటపుడయినా రాజమౌళి పర్మిషన్ తీసుకుని వెళ్లాలని అందరికి సూచించారట. ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా చూస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ అయ్యే వరకు చాలా జాగ్రత్త వహించాలని అందరికి సూచించారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: