సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. జనవరి 11న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ పోస్టర్స్ వదిలారు చిత్రయూనిట్. సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా వస్తుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ ఎనౌన్స్ చేశారు.

 

అయితే దర్శక నిర్మాతల ప్రమేయంతో మహేష్ సినిమా ఒకరోజు ముందుకు రాగా బన్ని సినిమా అనుకున్న డేట్ కే వస్తుంది. ఈ రెండు సినిమాల టీజర్ లు సూపర్ అనిపించాయి. అల వైకుంఠపురములో త్రివిక్రం మార్క్ సినిమాగా వస్తుండగా సరిలేరు అనీల్ డైరక్షన్ టాలెంట్ తో మహేష్ వన్ మ్యాన్ షో చేసేలా ఉన్నాడు. టీజర్ తో సినిమాలపై అంచనాలు పెంచగా ఒకేరోజు వస్తే సినిమాల కలక్షన్స్ మీద ప్రభావం పడుతుందని భావించి మహేష్ సినిమాను ఒకరోజు ముందుకు జరిపారు.

 

ఇక మహేష్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెకు సంబందించినంత వరకు ఇప్పటి వరకు ఒక్క పోస్టర్ మాత్రమే వచ్చింది. టీజర్ లో కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే లేటెస్ట్ గా మహేష్ తో రొమాంటిక్ మూడ్ లో ఉన్న రష్మిక పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. మహేష్, రష్మిక ఇద్దరు కౌగిలించుకున్న ఈ పోస్టర్ సూపర్ అనేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

 

చేసిన నాలుగు సినిమాలతోనే తెలుగులో స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మహేష్ తో చేయడం ఆమె కెరియర్ కు మరింత జోష్ తెస్తుందని చెప్పొచ్చు. సరిలేరు నీకెవ్వరు నుండి కొత్తగా వచ్చిన ఈ పోస్టర్ రష్మిక ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో ఆమె నటన కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని తెలుస్తుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా సరిలేరు నీకెవ్వరులో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: