వర్మ చేసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వర్మ ఒకరిద్దరిని కాదు దాదాపు అందరిని టార్గెట్ చేశాడు. బాబు, చినబాబు, మనసేన అధినేత, పిపి చాల్ అంటూ పొలిటికల్ కేడర్ లో ఉన్న అందరి గురించి ప్రస్థావించాడు. సినిమాలో వర్మ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే అయినేని రమ హత్య. అయితే ఆ హత్యకు బాబే కారణం అని చెబుతాడు పిపి చాల్.

 

బాబు అమెరికా వచి తన కాళ్ల మెద పడి క్షమించమని ఏడుస్తాడు.. జీసన్ ను, నన్ను రిక్వెస్ట్ చేశారు.. అయితే మధ్యలో అమ్మా జ్యోతి నిజమే కదా అంటే ఆమె అవునని చెబుతుంది. అయితే చాల్ ను ఇంటర్వ్యూ చేయడం ఇష్టం లేక జాఫర్ పారిపోతాడు. మాములుగా చాల్ చేసే అతిపై వర్మ ఎప్పుడూ పంచులేస్తూ ఉంటాడు.

 

ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా ఆయన్ని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక చాల్ గా నటించిన నటుడు కూడా పర్ఫెక్ట్ గా చేశాడు. తన సినిమాలో కాస్టింగ్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో కూడా కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

 

సినిమాపై ఇప్పటికే విపరీతమైన క్రేజ్ రాగా ఎన్నో గొడవలతో హడావిడి చేసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అంతా ఒకటే టార్గెట్ ప్రస్తుతం ఏపిలో అధికార పార్టీని సపోర్ట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ మిగతా రాజకీయ నేతలు ఏమనుకుంటున్నారో సినిమాలో చూపించారు. ఈ సినిమాకు కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ పెట్టగా కోర్టులో కేసు వేశారని టైటిల్ మార్చి కొన్ని సీన్స్ ట్రిం చేసి సినిమాను రిలీజ్ చేశాడు వర్మ. మొదటి షో టాక్ ను బట్టి చూస్తుంటే వర్మ ఏదైతే అనుకుని సినిమాను తీశాడో అది నూటికి నూరు శాతం ఆడియెన్స్ కు రీచ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: