టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది.  ప్రముఖ నటుడు, రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు.  కళారత్న... గొల్లపూడి మారుతీరావు కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. చెన్నైలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఇంట్లో రామయ్య, వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. 250కి పైగా సినిమాల్లో గొల్లపూడి నటించారు.

 

సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు.  మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. అన్నపూర్ణ, సుబ్బారావుకి అయిదో కొడుకు.  సినీరంగంలో మొదటి రచన ‘డాక్టర్‌ చక్రవర్తి’కి ఉత్తమ రచయితగా నంది పురస్కారం లభించింది.  కెరీర్ బిగినింగ్ లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో గొల్లపూడి పని చేశారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉపసంచాలకుడిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

 

బుల్లితెరపై కూడా ఆయన పలు కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

 

ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, రుగ్మతలు వెలుగులోకి తీసుకు వచ్చే కార్యక్రమాలతో ఎంతో మందిలో చైతన్యం తీసుకు వచ్చారు. విలన్, సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించాడు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 ఆయన నటించిన సినిమాలకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.   గొల్లపూడి మరణవార్తతో విషాద ఛాయలు నెలకొన్నాయి. నటీనటులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. మంచి వ్యక్తిని కోల్పోయని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: